Afghanistan: అఫ్గాన్ లో మరోసారి బాంబు పేలుళ్ల మోత మోగింది. నంగర్‌హార్ ప్రావిన్స్(Nangarhar province) స్పిన్‌ఘర్ జిల్లా(Spin Ghar district) తూర్పు ప్రాంతంలోని ఓ మసీదు(Mosque)లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మసీదు ఇమామ్‌కూ గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు.
శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు(bomb blast) చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తాలిబన్ అధికారులు సైతం ధ్రువీకరించారు. మసీదు లోపల పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించలేదు.
Also Read: Imran Khan: ఉగ్రవాదులతో చర్చలా అంటూ.. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆగ్రహం!
తాలిబన్లు(Talibans) అధికారంలోకి వచ్చాక అఫ్గాన్(Afghanistan)లో ఇస్లామిక్ స్టేట్(Islamic State group) ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని వారు గతంలోనూ అనేక సార్లు దాడులకు తెగబడ్డారు. పైగా నంగర్‌హార్ ప్రావిన్సులో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఇటీవల నవంబరు 2న సైతం కాబుల్ నగరంలోని మిలిటరీ ఆస్పత్రి వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు 19 మంది మృత్యువాతపడగా మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని అప్గాన్ ఎదుర్కొంటుందని యూఎన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook