Airtel Recharge Plans Increase: ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర 25 శాతం.. అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20 శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.
కొత్త ధరలు.. దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్టెల్ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం.. వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50 శాతం అధిక టాక్‌టైం, 200 జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1 పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా.. ఒక్కో యూజర్ నుంచి సరాసరి రెవెన్యూ (ఏఆర్పీయూ) రూ. 200 నుంచి రూ. 300 వరకు ఎయిర్‌టెల్‌కు చేరుతున్నట్లు కంపెనీ తెలిపింది. అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్అప్స్పైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లు ఎయిర్టెల్ పేర్కొంది.
Also Read: రిలయన్స్ ఇండస్ట్రీస్-సౌదీ ఆరామ్కో డీల్‌కు బ్రేక్..!
Also Read: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook