Rape allegations against Diego Maradona: ఫుట్‌బాల్ లెజెండ్, దివంగత డీగో మారడోనాపై ఓ క్యూబన్ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మారడోనా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఇదే మహిళ గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మారడోనాతో (Diego Maradona) తన సంబంధం పరస్పర అంగీకారంతోనే సాగిందని చెప్పడం గమనార్హం. అదే సమయంలో... మారడోనా ఒక సందర్భంలో తనను బలవంతం చేశాడని అప్పట్లో ఆరోపించింది. మారడోనా అనుచరుల బృందంపై ఆమె చేసిన మహిళల అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించి అర్జెంటీనా న్యాయ శాఖ విచారణ జరుపుతోంది. గత వారం విచారణకు హాజరైన సందర్భంగా మారడోనాపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
37 ఏళ్ల మేవీస్ అల్వారెజ్ అనే ఆ మహిళ 2001లో మారడోనాతో కలిసి అర్జెంటీనా (Argentina) వెళ్లినట్లు తెలిపింది. ఆ సమయంలో తన వయసు 16 ఏళ్లు కాగా, మారడోనా వయసు 40 ఏళ్లుగా పేర్కొంది. ఆ ట్రిప్‌కు కొద్దిరోజుల క్రితమే మారడోనాను తాను మొదటిసారి కలిసినట్లు పేర్కొంది. అప్పటికే డ్రగ్స్‌కు బానిసైన మారడోనా (Drug addict) క్యూబాలో చికిత్స తీసుకుంటున్నాడని... ఆ సమయంలోనే అతన్ని మొదటిసారి కలిశానని తెలిపింది. హవానాలో అతను చికిత్స తీసుకుంటున్న క్లినిక్‌లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. పక్క గదిలో అతని తల్లి ఉండగానే తనపై అత్యాచారం చేశాడని తెలిపింది.
ఆ సమయంలో తన నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడని... నిజానికి దాని గురించి తాను పెద్దగా ఆలోచించాలనుకోవట్లేదని చెప్పింది. మారడోనా చేసిన పనికి టీనేజ్‌లో ఒక ఆడపిల్ల గడపాల్సిన సున్నితమైన జీవితాన్ని కోల్పోయాన్ని వాపోయింది. ఇదే మేరీస్ అల్వారెజ్ గతంలో ఇచ్చిన కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో మారడోనాతో (Diego Maradona) తన సంబంధం పరస్పర అంగీకారంతోనే సాగిందని తెలిపింది. నిజానికి తమ మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉన్నప్పటికీ... మారడోనా అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకి స్నేహితుడన్న కారణంతో తన కుటుంబం కూడా తమ సంబంధానికి అనుమతించిందని చెప్పింది.
Also Read: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. బాలికపై సివిల్ ఢిఫెన్స్ అధికారి అత్యాచారం
మేవీస్ అల్వారెజ్ చేసిన తాజా ఆరోపణలపై (Rape allegations) స్పందించాల్సిందిగా అంతర్జాతీయ మీడియా మారడోనా మాజీ న్యాయ సలహాదారు మాషియస్ మోర్లాను సంప్రదించగా... అందుకు అతను తిరస్కరించారు. మేవీస్ ఆరోపణలపై క్యూబా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు. అర్జెంటీనా న్యాయ శాఖకు తాను చేసిన ఫిర్యాదు ద్వారా అక్రమ రవాణా బాధితులైన మహిళలకు సాయం చేయాలనుకుంటున్నట్లు మేవీస్ వెల్లడించారు. కాగా, గతేడాది నవంబర్ 25న ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా (60) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాలోని టిగ్రే పట్టణంలో ఉన్న తన నివాసంలో మారడోనా (Diego Maradona) తుదిశ్వాస విడిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook