Omicron: ఒమిక్రాన్‌ హెచ్చరికలాంటిది : డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌

WHO’s Dr Soumya Swaminathan Warns Against Omicron : ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని సౌమ్య స్వామినాథన్‌ సూచించారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని చెప్పారు. మాస్కులనేవి జేబులో ఉండే వ్యాక్సిన్లలాంటివని ఆమె చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 02:06 PM IST
  • కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక హెచ్చరిక
  • పలు సూచనలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌
  • ఒమ్రికాన్ ఒక వార్నింగ్ ఇస్తోంది
  • మాస్కులు జేబులో ఉండే వ్యాక్సిన్లు
Omicron: ఒమిక్రాన్‌ హెచ్చరికలాంటిది : డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌

'Omicron' May Be A Wake-Up Call: WHO's Chief Scientist Dr Soumya Swaminathan: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక హెచ్చరికలాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. భారత్‌లో తగిన కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడానికి ఒమ్రికాన్ ఒక వార్నింగ్ ఇస్తోందని అనారు. అలాగే కొత్త వేరియంట్‌ కట్టడికి పలు సూచనలు చేశారు. 

ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ముఖ్యంగా మాస్కులు (Masks) ధరించాలని చెప్పారు. మాస్కులనేవి జేబులో ఉండే వ్యాక్సిన్లలాంటివని (vaccines) ఆమె చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్‌కు (Vaccination‌) అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొత్త వేరియంట్‌ స్వభావాన్ని గుర్తించేందుకు మరింత అధ్యయనం అవసరమని చెప్పుకొచ్చారు. 

ఇక కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (New variant‌) ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికాలో అస్పష్టంగా ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ అంశాలపై యూఎస్‌ శాస్త్రవేత్తలు.. దక్షిణాఫ్రికాలోని సహచరులతో చురుగ్గా సంప్రదింపులు చేపడుతున్నట్లు తెలిపారు.

Also Read : MSRTC Employees Strike: ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించిన మహారాష్ట్ర ఆర్టీసీ

ఇక కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) వ్యాప్తి తీరు.. పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త సమీరన్‌ పాండా పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ కు (Omicron) సంబంధించి పలు దేశాల్లో జన్యుపరమైన వైవిధ్యాలు కనిపించినట్లు చెప్పుకొచ్చారు. ఈ మార్పులు వైరస్‌ వ్యాప్తిని పెంచుతాయా.. టీకాల పనితీరును ప్రభావితం చేస్తాయా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు భారత్‌ లో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్‌ (Covid Vaccination‌) ప్రక్రియను మరింత వేగవంతం, బలోపేతం చేయాలని సూచించారు. 

Also Read : PM Narendramodi : ప్రధానికి ప్రత్యేక రాగంతో పేరు పెట్టిన గ్రామస్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News