Government has no proposal to recognise Bitcoin as a currency: క్రిప్టో కరెన్సీలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని స్పష్టం చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ఈ వివరణ ఇచ్చారు.
దీనితో పాటు బిట్‌కాయిన్ డేటాపై కూడా క్లారిటీ ఇచ్చారు నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్ లావాదేవీల డేటాను ప్రభుత్వం సేకరించలేదని (Lok Sabha) స్పష్టం చేశారు.
ఏమిటి ఈ బిట్‌కాయిన్..
బిట్‌కాయిన్ (Bitcoin) అనేది ఒక క్రిప్టో కరెన్సీ. బ్లాక్ చైనా టెక్నాలజీ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఇది వర్చువల్ కరెన్సీ మాత్రమే. అంటే దీనిని డిజిటల్ రూపంలో మాత్రమే చూడగలం.. భౌతికంగా ఈ కాయిన్స్ ఉండవు.
2008లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎవరు రూపొందించారు అనే విషయంపై ఇంత వరకు స్పష్టమైన ఆధారాలు లేవు.
బిట్‌కాయిన్‌ను ఉపయోగించి వస్తు, సేవలకు చెల్లింపులు జరపొచ్చు. బ్యాంకులు, క్రెడిట్‌కార్డుల సహా ఇతర పేమెంట్ గేట్వేలు లేకుండానే వీటి ద్వారా లావాదేవీలు జరిపే వీలుంది. ఇందుకు కారణం బిట్‌కాయిన్ కరెన్సీతో పాటు సొంత పేమెంట్ వ్యవస్థను కూడా కలిగి ఉంది.
కొన్ని దిగ్గజ కంపెనీలు ఇప్పటికే వీటి లావాదేవీలను అనుమతిస్తున్నాయి. సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్ బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా గుర్తించింది కూడా.
మరిన్నిసంస్థలు కూడా బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల చెల్లింపులను అనుమతించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లో బిట్‌కాయన్ సహా క్రిప్టో కరెన్సీలపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ విషయంపై లోక్ సభలో నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు.
Also read: PM Modi On Omicron: ‘ఒమిక్రాన్’ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ హెచ్చరిక
Also read: Farm Laws Repeal Bill 2021: నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook