Why Rs 2,000 Notes are not available in ATMs: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వార్షిక నివేదికల ఆధారంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. 2017 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 9.512 లక్షల కోట్లు కాగా 2022 మార్చి చివరి నాటికి రూ. 27.057 లక్షలు కోట్లుగా ఉన్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి తెలిపారు.
Budget 2023 : బడ్జెట్ అనే పదం అసలు ఎక్కడ నుండి వచ్చిందనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా ? దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా మొట్టమొదటిసారిగా బడ్జెట్ ఎప్పుడు, ఎవరు ప్రవేశపెట్టారు ? బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Budget 2023, Amrit Kaal : 2021, 2022 తరహాలోనే ఈసారి కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్‌లెస్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం బడ్జెట్ 2023 కి సంబంధించిన సమాచారాన్ని పిడిఎఫ్ ఫైల్స్ రూపంలో యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
Parliament New Building Photos: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ కొత్త బిల్డింగ్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఫోటోలను విడుదల చేసింది.
TRS MLC Kavitha : కేంద్ర మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Nirmala Sitharaman Slams Kamareddy collector: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి మంత్రి కేటీఆర్ హితవు పలికారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
Nirmala Sitharaman Comments on KCR: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
Revanth Reddy Reaction on Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై గంటన్నరసేపు ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే... నల్ల మందు కలిపిన కల్లు తాగిన వాళ్లు ఎలా వ్యవహరిస్తారో అలాగే అనిపించింది అని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Budget 2022 Political Reaction: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23 చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా లేదని అన్నారు. తానేమీ కేంద్రంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోని గణాంకాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బడ్జెట్ గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
ECLGS scheme extended for MSMEs: కరోనాతో నష్టపోయిన చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. MSMEs లబ్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ గడువు పొడిగింపుతో పాటు కేంద్రం ఇంకా ఏయే నిర్ణయాలు తీసుకుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Budget 2022 News: కొవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల నుడుమ నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
Budget 2022 Expectations: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ నుంచి వేతన జీవులు ఏం కోరుకుంటున్నారు?
Budget 2022: ఈ సారీ కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్ రూపంలోనే ప్రవేశపెట్టనున్నారు. సాధారణ పౌరులు బడ్జెట్ వివరాలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది కేంద్రం.
Budget 2022: రెండేళ్లుగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా.. సవాళ్లను అదిగమించుకుంటూ ముందుకెళ్తోంది ఐటీ రంగం. మరి ఈ సారి బడ్జెట్‌పై ఐటీ రంగం అంచనాలు ఏమిటి?
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ను గుర్తించే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభలో ఈ అంశంపై వివరణ ఇచ్చారు.
ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.
LIC IPO Date 2021, LIC policy holders to have LIC shares: ఎల్ఐసి పాలసీదారులకు ఎల్ఐసి గుడ్ న్యూస్ చెప్పనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన Budget 2021లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
LIC IPO Date 2021, Good news for LIC policy holders: ఎల్ఐసి పాలసీదారులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2022 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించిన Budget 2021 లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసి ఐపిఓను 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు FM Nirmala Sitharaman తన బడ్జెట్ 2021 ప్రసంగంలో ప్రకటించారు.
Budget 2021 impacts on EPF: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ. 2.5 లక్షలు దాటినట్టయితే.. ఆ ఆదాయం కూడా Income tax పరిధిలోకే వస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. వివిధ ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీ రూపంలో ఉద్యోగులకు వచ్చే Tax free income ను పరిమితం చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.