Helicopter Blackbox Found: ఆర్మీ అధికారుల అణ్వేషణ ఫలించింది. తమిళనాడులో కుప్పకూలిన హెలీకాప్టర్ బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. మరోవైపు హెలీకాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరమైంది.
తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో జరిగిన ఘోర హెలీకాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్(Bipin Rawat)సహా 13 మంది దుర్మరణం చెందారు. అత్యాధునికమైన ఎంఐ 17 వి 5 హెలీకాప్టర్ ప్రమాదానికి గురవడం అందరినీ నిర్గాంతపర్చింది. ప్రమాదానికి కారణాలేంటనేది అంతుబట్టలేదు. సమగ్ర దర్యాప్తుకు కేంద్ర రక్షణశాఖ ఆదేశించడంతో దర్యాప్తు ముమ్మరమైంది. సంఘటనా స్థలానికి వాయుసేన అధిపతి వీఆర్ చౌధురి చేరుకున్నారు.
ప్రమాదానికి గురైన హెలీకాప్టర్లోని బ్లాక్‌బాక్స్(Blackbox)కోసం ఆర్మీ అధికారుు అణ్వేషణ సాగించారు. కాస్సేపటి క్రితం బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. వైమానికదళ సిబ్బంది ఈ బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకుంది. విచారణలో బ్లాక్‌బాక్స్ కీలకంగా మారుతుంది. ఎందుకంటే హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు బ్లాక్‌బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలున్నాయి. పైలట్ల మధ్య సంభాషణ రికార్డ్ అవుతుంది. ఆ సంభాషణను బట్టి ప్రమాదం ఎలా జరిగిందనేది అంచనా వేయవచ్చు.నారింజరంగులో ఉండే బ్లాక్‌బాక్స్ ప్రతికూల వాతావరణంలో కూడా తట్టుకునేలా ధృఢంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, నీటిలో మునిగినా ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.ఇప్పుడీ హెలీకాప్టర్ బ్లాక్‌బాక్స్ లభ్యం కావడంతో ప్రమాదానికి కారణాలేంటనేది తేలనున్నాయి. ఘటనా ప్రదేశానికి 30 అడుగుల దూరంలో ఈ బ్లాక్‌బాక్స్ లభ్యమైంది.
మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంంగా సాగుతోంది. ఛీఫ్ ఎయిర్ మార్షల్ వీకే చౌధురి ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. తమిళనాడు డీజీపీ సైలేంద్రబాబు సైతం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించింది.
Also read: Helicopter Crash: చిట్టితల్లిని చూడాలనుంది..వీలు కుదిరితే సాయంత్రం చేస్తాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook