Mi-17 chopper crash: సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతికి కారణమైన తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు (Rajnath Singh briefs Mi-17 chopper crash) రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. బిపిన్ రావత్ సహా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికి అధికారిక లాంఛనాలతో అత్యక్రియలు నిర్వహించనున్నట్లు (State funeral for CDS Bipin Rawat) తెలిపారు.
"బిపిన్ రావత్‌కు పూర్తిస్థాయిలో మిలిటరీ లాంఛనాలతో తుది వోడ్కోలు పలకనున్నాం. ఇతర సైనిక సిబ్బందికి కూడా ఆర్మీ లాంఛనాలతోనే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నాం" - రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
సమగ్ర దర్యాప్తు..
ఇప్పటికే ఈ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తునకు భారత వైమానిక దళం ఆదేశించినట్లు చెప్పారు (IAF ordered a tri-service inquiry into chopper crash) రాజ్‌నాథ్ సింగ్. ఈ దర్యాప్తునకు ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వం వహిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు బృందం నిన్ననే (బుధవారం) తమిళనాడుకు చేరుకుని.. ఆధారాల సేకరణను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
వరుణ్ సింగ్‌కు మెరుగైన చికిత్స..
హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడ్డ..గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు (Group Captain Varun Singh) విల్లింగ్టన్ ఆర్మీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు రాజ్‌నాథ్ వివరించారు. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్‌తో వైద్యం చేస్తున్నారని.. కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు (Rajnath Singh on Lok Sabha on chopper crash) తెలిపారు.
రెండు నిమిషాల మౌనం..
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన 13 మందికి సంతాపంగా లోక్ సభ సభ్యులు రెండు నిమషాల పాటు మౌనం పాటించారు. ఈ రోజే ఈ విషయంపై రాజ్య సభలోనూ రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసే అవకాశముంది.
హెలికాప్టర్ ప్రయాణమిలా..
సీడీఎస్ నిన్న ఉదయం 8:47 గంటలకు పాలం ఎయిర్‌బేస్ నుంచి ఎంబ్రేయర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయల్దేరి 11:34 గంటలకు సూలూర్ ఎయిర్‌బేస్‌లో దిగారు. అక్కడి నుంచి 11:48 గంటలకు ఎంఐ-17వీ5 హెలికాప్టర్లో వెల్లింగ్టన్కు బయల్దేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలోనే మధ్యాహ్నం 12:22 ప్రాంతంలో కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు ఏమిటి? ఎలా జరిగింది? అనే వివరాలు పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత వెల్లడి కానున్నాయి. ఇప్పటికే హెలికాప్టర్లో బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఈ ఘటన జరిగేందుకు కొన్ని క్షణాల ముందు ఆ హెలికాప్టర్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా తాజాగా బయటకు వచ్చింది.
Also read: CDS Bipin Rawat: బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ క్రాష్‌కు ముందు కనిపించిందిలా..
Also read: Helicopter Blackbox Found: ప్రమాద హెలీకాప్టర్లోని బ్లాక్‌బాక్స్ లభ్యం, వేగవంతమైన విచారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook