Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్​ అత్యక్రియలు నేడు

Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్​ రావత్, ఆయన సతీమణి అంత్యక్రియలు నేడు ఢిల్లీలో జరగనున్నాయి. ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 07:59 AM IST
  • నేడు జనరల్ బిపిన్​ రావత్ దంపతుల అంత్యక్రియలు
  • ఢిల్లీ కంటోన్మెంట్​లోని స్మశానవాటికలో ఏర్పాట్లు
  • సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
  • మధ్యాహ్నం వరకు సందర్శనకు అనుమతి
Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్​ అత్యక్రియలు నేడు

CDS General Bipin Rawat's funeral will take place today: తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (Bipin Rawat chopper crash) ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులికాల అత్యక్రియలు నేడు (శుక్రకవారం) జరగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్ స్క్వేర్​ స్మశానవాటికలో వీరికి అంతిమ సంస్కారాలు (CDS General Bipin Rawat's funeral) నిర్వహించనున్నారు.

ఆర్మీ అధికారిక లాంఛనాలతో వీరికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

అంతిమ యాత్ర ఇలా..

జనరల్ బిపిన్ రావత్​, మధులికా రావత్​ల భౌతిక దేహాలను గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం వారి నివాసంలోనే భౌతిక దేహాలను ఉంచారు.

ఇక్కడ ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాధారణ ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించనున్నారు.

ఆ తర్వాత రావత్ ఇంటి నుంచే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ప్రముఖుల నివాళి..

సీడీఎస్​ బిపిన్ రావత్​ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారందరికి సీఎం స్టాలిన్​, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఐఏఎఫ్​ చీఫ్​ మర్షల్ వివేక్ చౌధరీ సహా పలువురు ప్రముఖులు తమిళనాడులో నివాళులర్పించారు.

ఢిల్లీకి చేరుకున్న తర్వాత పాలం ఎయిర్ బేస్‌లో జనరల్ బిపిన్ రావత్‌, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 11 మంది పార్థివదేహాలకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ (Defence Minister Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్​ నివాళులర్పించారు.

ఆ తర్వాత ప్రధాని మోదీ (PM Modi pays tributes to CDS General Bipin Rawat) కూడా.. అమరులకు నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు.

ప్రమాదంలో ఇలా..

మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ (IAF chopper crash)​ బుధవారం మధ్యాహ్నం తమిళనాడు, నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో కుప్ప కూలింది. ఇందులో మొత్తం 13 మంది మృతి చెందారు. ఒక్కరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆయనకు ఆర్మీ హాస్పిటల్​లో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన యావత్ భారతావనిని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది.

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఐఏఎఫ్ సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. హెలికాప్టర్​ బ్లాక్​ బాక్స్​ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. త్వరలోనే ప్రమాదానికి కారణఆలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Also read: Bipin Rawat's mortal remains: బిపిన్ రావత్‌ పార్థివదేహానికి PM Modi అంతిమ నివాళి

Also read: Bipin Rawat chopper crash : దట్టమైన పొగ మంచులోకి వెళ్లడం వల్లే బిపిన్‌ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News