MG Motor India said that it will "drive" an electric vehicle priced between Rs 10-15 lakh: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా (MG Motors India).. దేశీయంగా మరో విద్యుత్ కార్‌ను (ఈవీ) విడుదల చేసేందుకు కసరరత్తు చేస్తోంది. అయితే ఈ సారి బడ్జెట్ ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఎంజీ మోటార్స్ భావిస్తోంది.
నూతన ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య (MG Budget Electrice car) ఉండనుంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం ఎంజీ ఎలక్ట్రిక్ కారు ధర ఎంతంటే..
ఎంజీ మోటార్స్ ప్రస్తుతం ఎస్యూవీ 'ZS EV' ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరను (ZS EV price) రూ.21 లక్షల నుంచి రూ.24.68 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ఉంచింది.
ప్రస్తుతం ఈ కంపెనీ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని కొత్త కార్లను విడుదల చేస్తుంది. అయితే భారత మార్కెట్‌కు, దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగునంగా వాటిల్లో మార్పులు చేసి.. కొత్త మోడల్‌గా వాటిని విడుదల చేస్తోంది. ఇప్పటికే కొత్త మోడల్ కోసం ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది కంపెనీ.
దేశీయ మార్కెట్లోకి ఎస్యూవీ అస్టోర్తో మంచి సేల్స్‌ను సాధించింది ఎంజీ మోటార్స్. దీనితో జోరుమీదున్న ఈ కంపెనీ.. ప్రస్తుతం ఈవీలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్ఐ) పథకం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తున్న నేపథ్యంలో ఈవీలే ప్రధాన వృద్ధి మార్గంగా భావిస్తున్నట్లు వివరించింది. కొత్త ఈవీ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేసే అవకాశమున్నట్లు వివరించింది.
ఆ కార్ల పోటీగా..
దేశంలో దిగ్గజ వాహన తయారీ కంపెనీలుగా ఉన్న టాటా విద్యుత్ వాహనాలకు పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్ ధరలో కొత్త కారును తీసుకురానుందని సమాచారం. ముఖ్యంగా టాటా నెక్సాన్, టిగోర్ ఈవీలకు ఈ ఎంజీ మోటార్స్ మోడల్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.
Also read: Amazon iPhone XR Sale: రూ.18,599లకే Apple iPhone మీ సొంతం చేసుకోండిలా!
Also read: Metro Brands IPO: నేటి నుంచే మెట్రో బ్రాండ్స్ ఐపీఓ- షేరు ధర ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook