Omicron cases: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో (Omicron cases in India) కొత్తగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీనితో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి పెరిగింది.
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారందరికి లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. అయితే వారందరిలోను స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించింది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలుతున్నట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. అయతే ఇంకా ఒమిక్రాన్ (Omicron variant) సామాజిక వ్యాప్తి దేశకు చేరుకోలేదని.. పరిస్థితులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఢిల్లీలో తొలుత ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన 37 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు సత్యేందర్. సోమవారం అతడికి నెగెటివ్‌గా తేలడంతో.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
ఓమిక్రాన్ భయాల నేపథ్యంలో.. ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న విదేశీ ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశామని.. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్ట్‌ను నుంచి వారిని బయటకు పంపుతున్నట్లు గుర్తు చేశారు.
ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 73 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) బయపడ్డాయి. అందులో అత్యధికం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి.
Also read: Omicron in Tamil Nadu: తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్ కేసులు.. చెన్నైకి ఒమిక్రాన్ ఎలా వచ్చిందంటే
Also read: Omicron: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Omicron cases: ఢిల్లీలో మరో నలుగురికి ఒమిక్రాన్- 10కి చేరిన మొత్తం కేసులు
దేశంలో ఆందోళనకరంగా ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో కొత్తగా నలుగురికి పాజిటివ్
కోలుకున్న తొలి ఒమిక్రాన్ బాధితుడు