Chhattisgarh: కన్నవాళ్ల కర్కషత్వం... రాత్రంతా ఆ శిశువుకు కాపలాగా వీధి కుక్క...

Dog guards abonded newborn baby girl: నిజానికి ఆ కుక్క శిశువుకు ఏమైనా హాని తలపెట్టిందేమోనని వారు ఆందోళన చెందారు. కానీ కాసేపటికి అర్థమైందేంటంటే... రాత్రి నుంచి ఆ కుక్కనే శిశువుకు కాపలాగా ఉందని గ్రహించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 06:24 PM IST
  • ఛత్తీస్‌గఢ్‌లో అమానవీయ ఘటన
  • అప్పుడే పుట్టిన శిశువును నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు
  • రాత్రంతా శిశువుకు కాపలాగా ఉన్న వీధి కుక్క
Chhattisgarh: కన్నవాళ్ల కర్కషత్వం... రాత్రంతా ఆ శిశువుకు కాపలాగా వీధి కుక్క...

Dog guards abonded newborn baby girl: కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు మనుషుల కన్నా జంతువులే నయం అనిపిస్తుంటుంది. ఇది కూడా అలాంటి సంఘటనే. ఇంకా పురిటి వాసన కూడా పోని ఓ పసిబిడ్డను (Infant Abonded) గుర్తు తెలియని వ్యక్తులు ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లిపోయారు. కన్నవారే బిడ్డ పట్ల ఇంత కర్కషత్వం ప్రదర్శించగా.. ఓ శునకం రాత్రంతా ఆ పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ముంగేలీ జిల్లా సరిస్తల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సరిస్తల్ గ్రామంలోని ఓ ప్రదేశంలో ఆ శిశువును గుర్తించారు. ఇంకా బొడ్డు పేగు కూడా కోయకుండానే ఆ పసిబిడ్డను ఎవరో అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఆ శిశువు ఏడుపు విని కొంతమంది దగ్గరికి వెళ్లి పరిశీలించారు. శిశువుకు (Infant) సమీపంలో కొన్ని వీధి కుక్కలు (Stray dogs) సంచరిస్తుండగా... మరో కుక్క, దాని పిల్లలు ఆ పసిబిడ్డ పక్కనే ఉండటం గమనించారు.

నిజానికి ఆ కుక్క శిశువుకు (Infant) ఏమైనా హాని తలపెట్టిందేమోనని వారు ఆందోళన చెందారు. కానీ కాసేపటికి అర్థమైందేంటంటే... రాత్రి నుంచి ఆ కుక్కనే శిశువుకు కాపలాగా ఉందని గ్రహించారు. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించగా శిశువును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆకాంక్ష అనే చైల్డ్ లైన్ సంస్థకు శిశువును తరలించారు.

స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ సంఘటనను (Viral news) తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసి తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ఆ శిశువును పోలీసులు ఆసుపత్రికి తరలించారని... ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మగబిడ్డను, ఆడబిడ్డను సమానంగా చూడలేకపోతే... ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శించే మనస్తత్వం ఉంటే తల్లిదండ్రులుగా మీరు అన్‌ఫిట్ అని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
 

Also Read: Bank Holiday Alert: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్-డిసెంబర్ చివరి 10 రోజుల్లో ఆరు రోజులు సెలవులే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News