Myanmar Landslides: మయన్మార్‌ జేడ్‌ గనుల్లో విరిగిపడిన కొండ చరియలు...ఒకరు మృతి, 70 మందికిపైగా గల్లంతు..!

Myanmar: మయన్మార్​ కాచిన్​ ప్రావిన్స్​లో ఘోర ప్రమాదం జరిగింది. జేడ్(పచ్చరాయి) గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతయ్యారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 01:30 PM IST
  • మయన్మార్‌లో ఘోర ప్రమాదం
  • కొండచరియలు విరిగిపడి 70 మందికిపైగా గల్లంతు
  • కచిన్ రాష్ట్రంలోని జేడ్ గనుల్లో ఘటన
Myanmar Landslides: మయన్మార్‌ జేడ్‌ గనుల్లో విరిగిపడిన కొండ చరియలు...ఒకరు మృతి, 70 మందికిపైగా గల్లంతు..!

Myanmar Landslides: ఉత్తర మయన్మార్‌లోని కచిన్‌ రాష్ట్రం(Kachin state)లో  కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా...70 మందికిపైగా గల్లంతయ్యారు. హాపాకంత్ ప్రాంతం(Hpakant mining region)లోని జేడ్(పచ్చరాయి) మైన్​​(jade mine)లో కూలీలు పనిచేస్తున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ గనుల్లో తరచూ కొండచరియలు(Landslides) విరిగిపడుతుంటాయి. గతేడాది జులై నెలలో జరిగిన ఇటువంటి ఘటనలోనే 174 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోని అతిపెద్ద, లాభదాయకమైన జేడ్‌ గనులు మయన్మార్‌లోని పాకాంట్‌ పట్టణానికి సమీపంలో ఉన్నాయి.

Also Read: Kim Jong-un: వీడియోలు చూశారని ఏడుగురిని ఉరి తీసిన ఉత్తర కొరియా నియంత కిమ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News