Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్​- పూర్తి వివరాలివే..

Bank Holidays January 2022: వచ్చే ఏడాది జనవరికి సంబంధించి బ్యాంక్​ సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్​బీఐ. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 సెలవు దినాలను నిర్ణయించింది. అందులో రెండు రోజులు జాతీయ స్థాయి సెలవులు ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 11:39 AM IST
  • జనవరి బ్యాంక్ సెలవుల జాబితా వెల్లడించిన ఆర్​బీఐ
  • వచ్చే నెలలో మొత్తం 16 సెలవులు
  • రెండు రోజులు నేషనల్ హాలిడేస్​
Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్​- పూర్తి వివరాలివే..

Bank Holidays January 2022: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) 2022 జనవరి బ్యాంక్​ సెలవుల జాబితాను (Bank Holidays for January 2022) ప్రకటించింది. ఆర్​బీఐ జాబితా ప్రకారం.. జనవరిలో మొత్తం 16 బ్యాంక్ సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ 16 రోజుల సెలవులు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించవు. స్థానిక పండుగలను, ప్రత్యేక రోజులను బట్టి ఈ సెలవులు (Bank Holidays in January 2022) ఉంటాయి.

రెండు నేషనల్ హాలిడేస్​..

వచ్చే నెలలో మొత్తం 16 సెలవుల్లో రెండు నేషనల్ హాలిడేస్ కావడం (National wide Bank Holidays) గమనార్హం. ఒకటి కొత్త సంవత్సరం (జనవరి 1) కాగా రెండోది గణతంత్ర్య దినోత్సవం (జనవరి 26).

జనవరి బ్యాంక్​ సెలవుల జాబితా..

జనవరి 1: కొత్త సంవత్సరం (దేశవ్యాప్తంగా సెలవు)
జనవరి 2: ఆదివారం సాధారణ సెలవు
జనవరి 4: లోసూంగ్​ (సిక్కిం)
జనవరి 8: రెండో శనివారం
జనవరి 9: ఆదివారం సాధారణ సెలవు
జనవరి 11: మిషినరీ డే (మిజోరం)
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి, పొంగల్​ (వివిధ రాష్ట్రాల్లో)
జనవరి 15: సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ డే (ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి సహా పలు ఇతర రాష్ట్రాల్లో)
జనవరి 16: ఆదివారం సాధరణ సెలవు
జనవరి 18: తాయ్​ పోసమ్​ (చెన్నై)
జనవరి 22: నాలుగో శనివారం
జనవరి 23: ఆదివారం సాధారణ హాలిడే
జనవరి 26: రిపబ్లిక్​ డే (దేశవ్యాప్తంగా సెలవు)
జనవరి 30: ఆదివారం సాధారణ సెలవు
జనవరి 31: మి-దామ్​-మి-ఫీ (అసోం)

Also read: RBI New Rule: కొత్త పేమెంట్​ రూల్స్ అమలు జనవరి 1 నుంచి కాదు.. కొత్త తేదీ ఇదే..!

Also read: Year ending 2021: డిసెంబర్​ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x