Malaika Arora Yoga Tips: నలభై ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ నటి మలైకా అరోరా ఎంతో ఫిట్ గా ఉంటుంది. వయసు పెరుగుతున్నా.. తన బెల్లీ ఫ్యాట్ పెరగకుండా తినే ఆహారం నుంచి చేసే వర్కౌట్స్ వరకు ఎంతో జాగ్రత్త వహిస్తుంది. అయితే బెల్లీ ఫ్యాట్ (పొట్టపై పేరుకున్న కొవ్వు) తొలిగించేందుకు ఓ రహస్యాన్ని తన అభిమానులకు చెప్పింది. మలైకా చెప్పిన టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా ఆమెలానే నాజుకైన నడుము వంపులను సాధించవచ్చు.
యోగాలోని ఏక్ పాద అధోముఖ స్వనాసన ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించవచ్చని మలైకా అరోరా సూచించింది. ఈ యోగాసనం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడం సహా అనేక ప్రయోజనాలను శరీరానికి అందిస్తుందని ఆమె తెలిపింది. ఇంతకీ ఆ యోగాసనం ఎలా వేయాలో.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఏక్ పాద అధోముఖ స్వనాసన ఎలా వేయాలంటే?
1) యోగా మ్యాట్ పై తొలుత మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత రెండు అరచేతులు, పాదాలపై శరీర బరువును మొత్తం పెట్టి.. నడుమును పైకి లేపాలి.
2) కాళ్లు, చేతులపై ఆధారంగా శరీరాన్ని సమాంతరంగా ఉంచి.. శ్వాస పీలుస్తూ, వదులుతూ ఉండాలి.
3) అదే సమయంలో మోకాళ్లు, మో చేతులు నిటారుగా ఉండాలి.
4) అప్పుడు ఊపిరి పీల్చుకుంటూ.. ముందుగా కుడి మోకాలిని పొట్ట వైపునకు తీసుకురావాలి.
5) ఆ తర్వాత కుడికాలును యథాస్థానంలో ఉంచాలి. అలా మోకాలును పొట్ట వైపునకు తీసుకునే క్రమంలో గాలి పీలుస్తూ.. కాలు వెనక్కి పెట్టే క్రమంలో గాలి వదిలేయాలి.
6) అలా కొంత సమయం పాటు చేస్తూ ఉండాలి. అయితే ఈ ప్రక్రియలో కాళ్లు, చేతులు ఏ మాత్రం కదలకూడదు.
7) అదే విధంగా మరో కాలుతో అదే ప్రక్రియను కొనసాగించాలి.
ఏక్ పద అధోముఖ స్వనాసన ప్రయోజనాలు
1) మనసు ప్రశాంతంగా ఉంటుంది.
2) చేతుల కండరాలలో బిగుతుతనం పెరుగుతుంది.
3) శరీరాన్ని సులభంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
4) కానీ, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లేదా అధిక రక్తపోటు ఉన్న రోగులు ఈ యోగా ఆసనం చేయడం మానుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఏ వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం విద్యాబోధన కోసమే వివరించింది. దీన్ని అనుసరించే ముందు సంబంధిత నిపుణుడి సలహాను పాటించడం ఉత్తమం.
Also Read: Peanuts Side Effects: డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులు వేరుశనగ తినడం ఆరోగ్యానికి హానికరం!
Also Read: Lemon Benefits: రోజుకో నిమ్మకాయ రసం... కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి