Micro Donation Campaign: మైక్రో డొనేషన్ కార్యక్రమం ప్రారంభం, వేయి రూపాయలు విరాళమిచ్చిన మోదీ

Micro Donation Campaign: భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మైక్రో డొనేషన్స్ క్యాంప్ దిగ్విజయంగా ప్రారంభమైంది. తొలి విరాళాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..చేసిన ట్వీట్ ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2021, 09:01 AM IST
Micro Donation Campaign: మైక్రో డొనేషన్ కార్యక్రమం ప్రారంభం, వేయి రూపాయలు విరాళమిచ్చిన మోదీ

Micro Donation Campaign: భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మైక్రో డొనేషన్స్ క్యాంప్ దిగ్విజయంగా ప్రారంభమైంది. తొలి విరాళాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..చేసిన ట్వీట్ ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తోంది. 

భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మైక్రో డొనేషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పార్టీలో ప్రతి వ్యక్తి కచ్చితంగా కనిష్టం 5 రూపాయల్నించి గరిష్టంగా వేయి రూపాయలవరకూ విరాళాలు స్వీకరిస్తారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి రోజు అంటే ఫిబ్రవరి 11 వరకూ ఈ విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగనుంది. 

బీజేపీ ప్రారంభించిన మైక్రో డొనేషన్స్ (Micro Donations Campaign) కార్యక్రమానికి ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ వేయి రూపాయలు విరాళమిచ్చారు. ఆ విరాళానికి సంబంధించిన రసీదును తీసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందరూ సహాయం చేయాలని బీజేపీ కార్యకర్తల్ని కోరారు. నేను భారతీయ జనతా పార్టీ ఫండ్ కోసం వేయి రూపాయలు విరాళమిచ్చారు. ఎప్పుడూ దేశానికి మొదటి స్థానమివ్వాలనేదే నా కోరిక. మా కార్యకర్తల ద్వారా జీవితాంతం నిస్వార్ధ సేవ చేసే సంస్కృతి..మీరిచ్చే మైక్రో డొనేషన్ ద్వారా సాధ్యమవుతుంది. బీజేపీని బలోపేతం చేయండి. దేశాన్ని బలోపేతం చేయండి అంటూ మోదీ (Narendra Modi) ట్వీట్ చేశారు. 

అటు బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వేయి రూపాయలు విరాళమిచ్చారు. నేను నమో యాప్ అనే డొనేషన్ మాడ్యూల్ సహాయంతో బీజేపీను బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. రిఫరల్ కోడ్ సహాయంతో ఈ ప్రజా ఉద్యమంలో స్నేహితులు, కుటుంబసభ్యుల్ని కనెక్ట్ చేయవచ్చు అంటూ ట్వీట్ చేశారు.

Also read: Vaccination for 15-18 years: జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ : ప్రధాని నరేంద్ర మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News