No Home Farewell for Universal Boss Chris Gayle: వెస్టిండీస్ (West Indies) సీనియర్ ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle)కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న గేల్ కోరికను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఖాతరు చేయలేదు. త్వరలో ఐర్లాండ్ (Ireland), ఇంగ్లండ్ (England)లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో గేల్‌కు చోటు కల్పించకుండా అవమాన పరిచింది. వెస్టిండీస్ జట్టులో వెటరన్ బ్యాట్స్‌మెన్ అయిన గేల్.. ఇప్పటికే టెస్ట్, వన్డేలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ తరఫున కేవలం టీ20 మ్యాచులు మాత్రమే ఆడుతున్న క్రిస్ గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై (Home Farewell) చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించాడు. దాంతో 42 ఏళ్ల గేల్ ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లకు ఎంపికవుతాడని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతడికి చోటు కల్పించలేదు. దాంతో గేల్‌కు ఘోర అవమానం జరిగింది. విండీస్ క్రికెట్ బోర్డు (West Indies Cricket Board) తాజా నిర్ణయంతో గేల్ తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. విండీస్ ఇచ్చిన షాక్‌తో గేల్ త్వరలోనే రిటైర్మెంట్ (Chris Gayle Retirement) ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Brett Lee: కుమారుడిపై కూడా కనికరం చూపని బ్రెట్ లీ.. మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది (వీడియో)!!
జనవరి 16న ఐర్లాండ్‌తో వెస్టిండీస్ ఏకైక టీ20, ఆ తర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఈ రెండు జట్లు టీ20లు ఆడేందుకు విండీస్ గడ్డపైకి రానున్నాయి. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్‌లు ఆడాడు. 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14321 పరుగులు సాధించి.. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. వెస్టిండీస్ తరపున గేల్ 79 మ్యాచ్‌ల్లో 1884 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గేల్ మాత్రమే.
Also Read: Telugu Films On OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అఖండ, పుష్ప.. రిలీజ్ ఎప్పుడంటే?!!
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు ఎంపికయిన విండీస్ జట్టు ఇదే:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియెన్ అలెన్ (ఇంగ్లండ్ టీ20లకు), డారెన్ బ్రావో (ఇంగ్లండ్ టీ20లకు), రోస్టన్ ఛేజ్, షెల్డెన్ కాట్రెల్, డామినిక్ డ్రేక్స్, షై హోప్, అకీలా హోస్సెన్, జాసన్ హోల్డర్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, రావ్‌మెన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి