Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌కు మెట్రో నగరాలే కారణంగా మారుతున్నాయా..పరిస్థితి చూస్తే అదే అన్పిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నైలలో కొత్త వేరియంట్ కేసులు కేవలం ఒక్క నెలలోనే వేగం పుంజుకున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
యూరప్ తరువాత కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ సంక్రమణ చూస్తుంటే కరోనా థర్డ్‌వేవ్ భయం పట్టుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో రోజువారీ కేసులు కేవలం నెల వ్యవధిలోనే వేగం పుంజుకున్నాయి. ఈ నగరాల్లో దాదాపు 75 శాతం ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఇండియాలో ఒమిక్రాన్ డిసెంబర్ 2 న ప్రవేశించింది. కేవలం 1 నెలలోనే ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 17 వందలకు చేరుకుంది. ఒక వారంలోనే కరోనా కొత్త వేరియంట్ మూడు రెట్లు పెరిగిపోయింది. అత్యంత వేగంగా సంక్రమించడం ఆందోళన కల్గిస్తోంది. అయితే లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. అయితే కేసుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైందనే విషయాన్ని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛీఫ్ డాక్టర్ ఎన్ కే అరోడా ధృవీకరించారు. దేశంలో కరోనా ధర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమైందనేది స్పష్టమైందని చెప్పారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కరోనా కేసులు కూడా 22 శాతం పెరిగాయన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల్లో 12 శాతం ఒమిక్రాన్ కేసులున్నాయని డాక్టర్ అరోరా చెప్పారు. గత వారం ఇది 28 శాతానికి చేరుకుందని..దేశంలో ఇతర వేరియంట్లు కూడా వేగంగా సంక్రమిస్తున్నాయని చెప్పారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కల్గించే అంశమన్నారు.
దేశంలో ఒమిక్రాన్ (Omicron Variant) అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఉన్నాయి. మహారాష్ట్రంలో ఇప్పటి వరకూ 501, ఢిల్లీలో 351, కేరళలో 156, గుజరాత్లో 136, తమిళనాడులో 121, రాజస్థాన్‌లో 120, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
Also read: Arvind Kejriwal - Covid 19: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా.. ఇంట్లోనే ఐసొలేషన్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook