Lovers commits suicide after parents not agree thier marriage: ప్రేమించి మంచి జీవితాలను గడుపుదామనుకున్న ఓ ప్రేమ జంట.. పెద్దల్ని ఒప్పించలేక ప్రాణాలు (Lovers Commits Suicide) బలితీసుకున్నారు. ఒకరికి దూరంగా మరొకరు ఉండలేక ఇంకో జంట కూడా చేజేతులా ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి (Sangareddy), కుమురం భీం (Komaram Bheem) జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనలు కన్నవారికి కడుపు కోతను మిగిల్చాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురానికి చెందిన 22 ఏళ్ల బేగరి శివ, సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల బొగ్గుల అమృత దూరపు బంధువులు. శివ (Shiva) సంగారెడ్డిలో బీ ఫార్మసీ చదువుతుండగా.. అమృత (Amrutha) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తోంది. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
శివ, అమృతలు తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా.. వారు పెళ్లికి ఒప్పుకోలేదు. చాలా రోజులు ఎదురుచూశారు. అయినా తల్లిదండ్రులలో మార్పు రాలేదు. పెళ్లికి ఒప్పించే ధైర్యం చేయలేక, విడిగా బతకలేక ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి బుధేరాలో నిర్మానుష ప్రదేశానికి వెళ్లిన శివ.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పి స్విచ్చాఫ్ చేశాడు. తల్లిదండ్రులకు తిరిగి కాల్ చేసినా.. లాభం లేకుండా పోయింది. అనంతరం శివ, అమృతలు కలిసి ఓ సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఉరేసుకొన్నారు.
Also Read: Virat Kohli ODI Series: టీమిండియాకు భారీ షాక్.. వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! కారణం ఏంటంటే?
శివ కుటుంబ సభ్యులు బుధేరా చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు శివ, అమృతల శవాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్, ఆధార్ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారాన్ని ఇచ్చి ఉంటే.. ఇదంతా జరిగేది కాదని, సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా లోకేషన్‌కు చేరుకునే వీలుండేదని సదాశివపేట గ్రామీణ సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
కుమురం భీం జిల్లా వాంకిడిలోని రాంనగర్ కాలనీకి చెందిన నౌగడె శ్రీకాంత్ (Srikanth), ఎల్ములె గీత (Geetha) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోగా.. గీత తల్లిదండ్రులు అంగీకరించలేదు. గతేడాది డిసెంబర్ 27న ఇద్దరు ఇళ్లు విడిచి పారిపోయారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం ఆకిని గ్రామ శివారులోని పత్తిచేనులో ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించారు. దుర్వాసన వస్తుండడంతో మూడు రోజుల కిందటే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. శ్రీకాంత్, గీత పెద్దగా చదువుకోకపోవడంతో తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులు చేస్తుండేవారు. గీత తల్లిదండ్రు (Parents)ల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Sriharikota Corona: శ్రీహరికోటలో న్యూఇయర్ పార్టీ తెచ్చిన తంటా.. 14 మందికి కరోనా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook