Chiranjeevi Review: సేనాపతి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సూపర్ రివ్యూ ఇదే

Chiranjeevi Review: అగ్రహీరోలు కూడా ఇప్పుడు సినిమా క్రిటిక్స్ చేస్తున్నారు. పుష్ప సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు సమీక్ష ఇవ్వగా..ఇప్పుడు సేనాపతి సినిమాకు మెగాస్టార్ రివ్యూ ఇచ్చారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2022, 04:46 PM IST
Chiranjeevi Review: సేనాపతి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సూపర్ రివ్యూ ఇదే

Chiranjeevi Review: అగ్రహీరోలు కూడా ఇప్పుడు సినిమా క్రిటిక్స్ చేస్తున్నారు. పుష్ప సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్ బాబు సమీక్ష ఇవ్వగా..ఇప్పుడు సేనాపతి సినిమాకు మెగాస్టార్ రివ్యూ ఇచ్చారు.

టాలీవుడ్‌లో అగ్రహీరోలు ఇటీవలికాలంలో సినిమాలపై సమీక్షలు ఇస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుష్ప సినిమాపై ఇచ్చిన  సమీక్ష ఇప్పటికే వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు, డీఎస్పీ సంగీతానికి, సుకుమార్ దర్శకత్వానికి కితాబిచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సమీక్ష హల్‌చల్ చేస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరేశ్, హర్షవర్ధన్, జ్ఞానేశ్వర్, సత్యప్రకాశ్ కీలకపాత్రల్లో నటించిన సేనాపతికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమీక్ష ఇచ్చాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్నించి మంచి స్పందన లభిస్తోంది. మెగాస్టార్ కుమార్తె సుస్మిత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. 

సేనాపతి సినిమాపై చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. సేనాపతి సినిమాను (Senapati)యువ దర్శకుడు పవన్ అద్భుతంగా, ఆసక్తికరంగా తీశాడన్నారు. అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉండేలా సినిమా ఉందన్నాడు. అభిరుచికి అద్దం పట్టే చిత్రాన్ని నిర్మించి యవ నిర్మాతలు సుస్మిత, విష్ణులకు తన ప్రేమాభినందనలు తెలిపాడు. అన్నింటికంటే..ముఖ్యంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra prasad) అద్భుతంగా నటించారన్నాడు. రాజేంద్రప్రసాద్ నటనా ప్రతిభకు ఈ సినిమా మచ్చుతునక అని ప్రశంసించాడు.

Also read: Meena Tested Covid Postive: సినీ నటి మీనా కుటుంబాన్ని చుట్టిన కరోనా మహమ్మారి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News