Bangladesh Team dressing room celebrations with hum honge kamyab chants after victory in New Zealand: గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో సతమతమయిన బంగ్లాదేశ్ (Bangladesh).. పటిష్ట న్యూజిలాండ్ (New Zealand) జట్టును సొంత గడ్డపైనే ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మౌంట్ మాంగనూయిలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 8 వికెట్ల తేడాతో బంగ్లా ఓడించింది. న్యూజిలాండ్‌లో బంగ్లాకు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇప్పటి వరకూ విదేశాల్లో 61 టెస్టులు ఆడిన బంగ్లాదేశ్.. కేవలం ఆరు టెస్టుల్లోనే విజయం సాధించింది. మరోవైపు 2011 జనవరి (హామిల్టన్‌లో పాకిస్తాన్ విజయం) తర్వాత న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా కూడా బంగ్లా నిలిచింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 328 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (122) సెంచరీ చేయగా.. విల్ యంగ్ (52), హెన్రీ నికోల్స్ (75) అర్థ శతకాలతో రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మదుల్ హసన్ జాయ్ (78), షాంటో (64), మోమినుల్ (88), లిటన్ దాస్ (86) అర్ధ శతకాలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 130 పరుగుల ఆధిక్యం దక్కింది. బంగ్లా బౌలర్ ఇబాదత్ హుస్సేన్ 6 వికెట్లతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్169 పరుగులకే చేతులెత్తేసింది. 40 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కివీస్ గడ్డపై బంగ్లా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
Also Read: Composite Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.634లకే LPG గ్యాస్ సిలిండర్!
Bangladesh Team dressing room celebrations following the historic win at Mount Maunganui.#BCB #cricket #BANvsNZ pic.twitter.com/78pGFQ30wP
— Bangladesh Cricket (@BCBtigers) January 5, 2022
న్యూజిలాండ్ గడ్డపై తొలి విజయం దక్కడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల (Bangladesh Players) ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలవగానే మైదానంలోకి పరుగెత్తి సంబరాలు చేసుకున్న బంగ్లా ప్లేయర్స్.. డ్రెస్సింగ్ రూమ్ (Dressing Room Celebrations)లో రచ్చచేశారు. ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సిబ్బంది పెద్దగా అరుస్తూ గంతులు వేశారు. ముఖ్యంగా ముష్ఫికర్ రహీమ్ అయితే అరుస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆటగాళ్లు బంగ్లాలో 'హమ్ హోంగే కమ్యాబ్' అనే పాట పాడారు. ఇందుకు సంబందించిన వీడియోను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక అద్భుత విజయం సాధించిన బంగ్లాపై మాజీలు, ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: IND vs SA: లంచ్ బ్రేక్.. ఆరు వికెట్లు కోల్పోయిన రాహుల్ సేన! పీకల్లోతు కష్టాల్లో భారత్!!
Congratulations @BCBtigers🇧🇩 for creating history in Mount Maunganui! To win the Test by 8 wickets and register their first-ever Test win over New Zealand is inspirational and an incredible achievement. I am sure this win will be cherished for a long time. #NZvsBan pic.twitter.com/oSAnlAkzbI
— VVS Laxman (@VVSLaxman281) January 5, 2022
Well played, Bangladesh 🇧🇩 👏👏
Not many teams can beat New Zealand in their backyard…
2021 was a great year for Test cricket…2022 has started on a great note too. ✌️🥳
— Aakash Chopra (@cricketaakash) January 5, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook