Hotel Mandarin Oriental: అమెరికాలోని ప్రముఖ లగ్జరీ హోటల్ చేజిక్కించుకున్న రిలయన్స్ సంస్థ

Hotel Mandarin Oriental: ప్రముఖ ఇండియన్ కంపెనీ రిలయన్స్ ఇప్పుడు హోటల్ రంగంపై దృష్టి సారించింది. అమెరికాకు చెందిన దిగ్గజ హోటల్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ ఇప్పుడు రిలయన్స్ చేతికి చిక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2022, 10:55 AM IST
Hotel Mandarin Oriental: అమెరికాలోని ప్రముఖ లగ్జరీ హోటల్ చేజిక్కించుకున్న రిలయన్స్ సంస్థ

Hotel Mandarin Oriental: ప్రముఖ ఇండియన్ కంపెనీ రిలయన్స్ ఇప్పుడు హోటల్ రంగంపై దృష్టి సారించింది. అమెరికాకు చెందిన దిగ్గజ హోటల్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ ఇప్పుడు రిలయన్స్ చేతికి చిక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

టెలీకం, రిటైల్, ఆయిల్, టెక్స్‌టైల్ రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన రిలయన్స్ దృష్టి ఇప్పుడు హోటల్ రంగంపై ఉంది. ఇందులో భాగంగానే కీలకమైన అడుగేసింది. ప్రపంచంలో సుప్రసిద్ధమైన అమెరికాలోని మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ హోటల్‌ను చేజిక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ హోటల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 73.37 శాతం వాటా రిలయన్స్ చేతికి చిక్కనుంది. ఈ ఒప్పందం ప్రకారం హోటల్‌లో 73.37 శాతం వాటాను పరోక్షంగా కలిగి ఉన్న కొలంబస్ సెంటర్ కార్పొరేషన్ నుంచి షేర్ మూలధనాన్ని ఆర్ఐఐహెచ్‌ఎల్ (RIIHL) కొనుగోలు చేయనుంది. 2003లో ఏర్పాటైన మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్‌లో రిలయన్స్ సంస్థ 736 కోట్లను వెచ్చించనుంది. 

ఇటీవల కొద్దికాలంగా రిలయన్స్ సంస్థ ఆతిధ్య రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఈ సంస్థ ఈఐహెచ్ లిమిటెడ్, స్టోక్ పార్క్ లిమిటెడ్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఈ హోటల్‌లోని ఇతర పెట్టుబడిదారులు కూడా తమ వాటాను విక్రయిస్తే..ఇప్పుడున్న ధర ప్రకారమే కొనుగోలు చేస్తామని కూడా రిలయన్స్ ఇండస్ట్రీ (Reliance Industries ) తెలిపింది. 2018లో ఈ హోటల్ 115 మిలియన్ డాలర్లు, 2019లో 113 మిలియన్ డాలర్లు ఆర్జించింది. 

అంతర్జాతీయ గుర్తింపు పొందిన మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ (Mandarin Oriental Newyork) హోటల్ ఐకానిక్ లగ్జరీ హోటల్‌గా పేరుగాంచింది. AAA 5 సహా కీలకమైన అవార్డుల్ని గెల్చుకుంది. డైమండ్ హోటల్, ఫోర్బ్స్ పైవ్ స్టార్ , ఫోర్బ్స్ పైవ్ స్టార్ స్పా వంటి అంతర్జాతీయ అవార్డులు కూడా గెల్చుకుంది. 

Also read: Todays Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News