Antigen Test Kit Procedure: కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోండిలా!

Antigen Test Kit Procedure: మీరు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? అయితే కరోనా పరీక్ష చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాలంటే వెనకాడుతున్నారా? అయితే ఇప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 04:39 PM IST
Antigen Test Kit Procedure: కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోండిలా!

Antigen Test Kit Procedure: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా మూడో వేవ్ వచ్చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఒకవైపు దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను పాటిస్తుండగా.. మరోవైపు దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియను ఊపందుకుంది.  

దేశంలో కరోనా కేసులు, మరణాలు నేపథ్యంలో ప్రజలందరూ బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకునేందుక మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కరోనా టెస్ట్ నిర్వహించుకునే విధంగా మార్కెట్లో కొన్ని యాంటిజెన్ కిట్లు లభిస్తున్నాయి. వాటితో కరోనా పరీక్ష ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 

ఆన్ లైన్ లేదా దగ్గర్లోని మెడికల్ దుకాణంలో లభ్యం

మీ ఇంట్లో ఎవరైనా చాలా రోజులుగా జలుబు, ఫ్లూ వంటి కరోనా లక్షణాలు ఉంటే ఇప్పుడు మీ ఇంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహించవచ్చు. కొవిడ్ టెస్ట్ నిర్వహించేందుకు మీకు ర్యాపిట్ యాంజిజెన్ కిట్ అవసరం. ఇది మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది.

కరోనా లక్షణాలు ఉన్న వారికి ఈ కొవిడ్ టెస్ట్ నిర్వహించి.. వైరస్ సోకిందా? లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కరోనా లక్షణాలు ఉన్నా.. ఈ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలకపోతే.. వారిని ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని సార్లు యాంటిజెన్ పరీక్ష వల్ల సానూకూల ఫలితాలు రాకపోవచ్చు. 

ICMR ఆమోదించిన కిట్లు

దేశంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ICMR ఇంట్లోనే కొవిడ్ టెస్ట్ నిర్వహించుకునేందుకు 7 ర్యాపిడ్ కిట్లు ఆమోదించింది. వాటిలో CoviSelf, PanBio, KoviFind, Angcard, Cleantest, AbCheck, Ultra Covi వంటి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. 

ర్యాపిడ్ యాంటిజెన్ హోమ్ టెస్ట్ కిట్ ధర ఎంత?

కొవిడ్ పరీక్ష కోసం నిర్వహించే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు మార్కెట్ తో పాటు అన్ని వెబ్ సైట్లలో సులభంగా కొనుగోలు చేయవచ్చు. రూ.250 నుంచి ఈ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు వరకు ఉంటాయి. అయితే మీరు కొనుగోలు చేసే ర్యాపిడ్ కిట్ ICMR ఆమోదించిన కిట్ అయి ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

ఇంట్లోనే సురక్షింతగా టెస్ట్ చేసుకోండిలా..

ముందుగా కిట్ ను తెరిచి దానిలో ఉంచిన అన్ని వస్తువులను తీసి టేబుల్ పై ఉంచండి. ఆ తర్వాత అందులోని ఎక్స్ ట్రాక్షన్ ట్యూబ్ ను తీసుకొని.. అందులోని ద్రవం క్రిందికి వచ్చేలా బాగా షేక్ చేయాలి. స్టైరైల్ పిన్ తో ముక్కులోని 2-3 సెంటీమీటర్ల వరకు లోపలికి పంపి.. దానితో శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. 

ఆ తర్వాత ఆ శాంపిల్స్ ను తీసి ఆ ద్రవంలో ముంచి.. ట్యూబ్ ను కొద్దిగా షేక్ చేయాలి. కిట్ లోని కరోనా పరీక్షకు సంబంధించిన కార్డును తీసుకోవాలి. ఆ నాజిల్ లో ద్రవాన్ని రెండు నుంచి మూడు డ్రాప్స్ వేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కొవిడ్ పరీక్షకు చేసిన రిజల్డ్ వచ్చింది. 

కరోనా పాజిటివ్ లేదా నెగెటివ్ తెలుసుకోవడం ఎలా?

కొవిడ్ టెస్టు కార్డులోని C, T అనే రెండు అక్షరాలు ఉంటాయి. ఆ ద్రవం నాజిల్ లో వేసిన 15 నిమిషాల తర్వాత C అనే అక్షరం ముందు ఎరుపు రంగు కనిపిస్తే.. మీకు కరోనా వైరస్ సోకలేదు. ఒకవేళ T అనే అక్షరం ముందు ఎరుపు రంగులో కనిపిస్తే.. మీరు కరోనా వైరస్ బారిన పడినట్లే లెక్క. 

(గమనిక: ఈ కథనం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కిట్‌ను ఎలా సరిగ్గా ఉపయోగించాలో మాత్రమే వివరిస్తుంది. మీరు ఇంట్లో పరీక్షలు చేయించుకున్న తర్వాత పాజిటివ్‌గా ఉంటే, భయపడకండి. వెంటనే RT-PCR పరీక్ష చేయించుకోండి. దాని ఫలితం వచ్చే వరకు క్వారంటైన్ చేయండి. జాగ్రత్తలు తీసుకోండి. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ అవసరమో లేదో అడిగి తెలుసుకోండి)

Also Read: Python Viral Video: భారీ కొండచిలువను భుజాలపై మోసుకెళ్లాడు...ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు..

Also Read: Viral Video: సముద్రంలో జారిపడిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News