India vs South Africa : రెండో రోజు ఆట ముగిసింది.. 70 పరుగుల లీడ్‌లో భారత్‌!

India vs South Africa 3rd Test Day 2 Highlights, India leads by 70 runs : భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రసవత్తరంగా మారుతోన్న ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌. మూడో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసిన భారత్. 70 రన్స్‌తో లీడ్‌లో కొనసాగుతోన్న టీమిండియా.

Last Updated : Jan 12, 2022, 10:53 PM IST
India vs South Africa : రెండో రోజు ఆట ముగిసింది.. 70 పరుగుల లీడ్‌లో భారత్‌!

India vs South Africa 3rd Test Day 2 Highlights, India leads by 70 runs : భారత్, (India) దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ టెన్షన్ పెంచుతోంది. మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (14), (Virat Kohli) పుజారా (9) (Cheteshwar Pujara) ఉన్నారు. ప్రొటీస్‌ బౌలర్లు జాన్‌సెన్, రబాడ తలో వికెట్‌ తీశారు. ఇక అంతకుముందు బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా (South Africa) తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు 223/10. 

అయితే భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసిన టీమింయాకు మొదట ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (10), ( KL Rahul) మయాంక్‌ అగర్వాల్ (7) (Mayank Agarwal) ఔట్ అయ్యారు. కేఎల్‌ రాహుల్‌ను జన్సెన్‌, మయాంక్‌ను రబాడ పెవిలియన్‌కు (pavillion) పంపారు. ఫస్ట్ ఓపెనర్స్ ఆచితూచి ఆడారు. అయితే తర్వాత ఒక్కసారిగా వికెట్లు పడిపోయాయి. 

ఇక తర్వాత క్రీజ్‌లోకి పుజారా, కెప్టెన్‌ కోహ్లీ వచ్చారు. వారిద్దరూ కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మొత్తానికి రెండో రోజు ఆటను 57/2 స్కోర్‌ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

Also Read : New ISRO Chief: ఇస్రో ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియామకం

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని టీమిండియా ప్రస్తుతం 70 రన్స్‌తో లీడ్‌లో (India leading South Africa by 70 runs) కొనసాగుతోంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో.. దక్షిణాఫ్రికాకు (South Africa) భారీ లక్ష్యం నిర్దేశిస్తేనే సిరీస్‌ విజయం సాధించే అవకాశాలు టీమిండియాకు ఉంటాయి.

Also Read : IND Vs SA 3rd Test: ఇండియా కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు- సచిన్ సరసన విరాట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News