IND vs SA: దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు మరో ఇద్దరు ఎంపిక- తుది జట్టు వివరాలివే..

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్​లో మార్పులు చేసింది బీసీసీఐ. వాషింగ్టన్ సుందర్​కు కరోనా సోకడంతో అతడి స్థానంలో వేరే ప్లేయర్లను ఎంపిక చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 08:02 PM IST
  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు టీమ్ ఖరారు
  • వాషింగ్డన్​ సుందర్ స్థానంలో మరో ఇద్దరికి చోటు
  • ఈ నెల 19న ప్రారంభం కానున్న సిరీస్​
IND vs SA: దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు మరో ఇద్దరు ఎంపిక- తుది జట్టు వివరాలివే..

IND vs SA: టీమ్​ ఇండియా దక్షిణాఫ్రికా జట్టుల మధ్య జరిగే వన్డే సిరీస్​కు (India South Africa ODI Series ) కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. బౌలర్లు జయంత్ యాదవ్​, నవదీప్​ సైనీలను తుది జట్టుకు (IND vs SA ODI) ఎంపిక చేసింది.

ఇంతకు ముందు ప్రకటించిన జట్టులో వాషిగ్టన్ సుందర్​కు కరోనా సోకడంతో (Washington Sundar tested Corona Positive) అతడి స్థానంలో ఈ ఇద్దరిని తీసుకున్నట్లు ప్రకటించింది బీసీసీఐ.

ఇండియా, దక్షిణాఫ్రికల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ నెల 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనుంది.

ఈ వన్డే మ్యాచ్​లకు విరాట్​ కోహ్లీ (Virat Kohli) మినహా సీనియర్ క్రికెటర్లంతా రెస్టులో ఉన్నారు. దీనితో యువ ప్లేయర్లపైనే బాధ్యతను మొపింది బీసీసీఐ. ఇందులో భాగంగా కేఎల్​ రాహుల్​కు కెప్టెన్సీ (KL Rahul team India Captain) బాధ్యతలు అప్పజెప్పింది. వైస్​ కెప్టెన్​గా బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రాకు బాధ్యతలు ఇచ్చింది.

ఇక ఈ టీమ్​లో విరాట్​ కోహ్లీ, శిఖర్​ ధావన్, రిషబ్ పంత్​, రుతురాజ్​ గైక్వాడ్​, సూర్యకుమార్ యాదవ్​, శ్రేయస్​ అయ్యర్​, వెంకటేశ్​ అయ్యర్​, భువనేశ్వర్​ కుమార్​, ఆర్​. అశ్విన్​, యుజ్వేంద్ర చాహల్​, సిరాజ్, శార్దుల్ ఠాకూర్​లు (Team India Squad For IND vs SA ODI ) ఆడనున్నారు.

Also read: Shahid Afridi Sex Scandal: సెక్స్ స్కాండిల్ లో ఇరుక్కున్న పాక్ క్రికెటర్.. ఫ్యాన్ గర్ల్ తో రాసలీలలు

Also read: Saina Accepted Siddharth Apology: క్షమాపణలు కోరిన హీరో సిద్దార్థ్.. అంగీకరించిన సైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News