PV Sindhu beat Ashmita Chaliha enters into India Open 2022 Semi Finals: భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) ఇండియా ఓపెన్ 2022లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. అద్భుత ఆటతో యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ (India Open) 2022లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 21 ఏళ్ల అశ్మిత ఛాలిహ (Ashmita Chaliha)పై 21-7, 21-18 తేడాతో సింధు గెలుపొందారు. వరుస సెట్లలో ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. 36 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు ముందు ఛాలిహను నిలవలేకపోయింది.
తొలి గేమ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన పీవీ సింధుకు పోటీ లేకుండా పోయింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ అశ్మిత ఛాలిహపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే 21-7తో సింధు తొలి గేమ్‌ను గెలుచుకున్నారు.
తొలి గేమ్‌లో తడబడిన ఛాలిహ.. రెండో గేమ్‌లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. సింధుకు ధీటుగా పాయింట్లు రాబడుతో పోటీలో నిలిచింది. అయితే పుంజుకున్న సింధు ఛాలిహకు అవకాశం ఇవ్వలేదు. 21-18 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచును కూడా కైవసం చేసుకున్నారు.
Also Read: Rishabh Pant - Bat: అచ్చు చిన్న పిల్లల మాదిరే.. బ్యాట్‌కి క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్!!
సెమీ ఫైనల్స్‌లో ఆరో సీడ్, థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్ (Supanida Katethong)తో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తలపడనున్నారు. సింగపూర్‌కు చెందిన మూడవ సీడ్ యో జియా మిన్ అధిక జ్వరం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోగా.. సుపానిడా సెమీ ఫైనల్స్‌కు దూసుకొచ్చారు. అంతకుముందు ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించిన సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
మరోవైపు లక్ష్యసేన్ (Lakshya Sen), ఆకర్షి కశ్యప్ (Aakarshi Kashyap) కూడా ఇండియా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్టారు. షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌పై 14-21, 21-9, 21-14 తేడాతో లక్ష్యసేన్ గెలిచాడు. మాల్వికా మన్సోద్పై 21-12, 21-15 తేడాతో ఆకర్షి విజయం సాధించారు. శుక్రవారం సాయంత్రం సాత్విక్-చిరాగ్ పురుషుల డబుల్స్ జోడీ మలేషియాకు చెందిన కియాన్ హీన్-లో కియాన్ హీన్ జోడీతో తలపడనుంది.
Also Read: Lockdown in Telangana: తెలంగాణలో లాక్డౌన్ ఉంటుందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి