Pandit Birju Maharaj: ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్‌‌ కన్నుమూత

Pandit Birju Maharaj: ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) ఆదివారం మరణించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 08:53 AM IST
  • పండిట్ బిర్జు మహారాజ్‌‌ కన్నుమూత
  • కథక్ నృత్యకారుడిగా గుర్తింపు
Pandit Birju Maharaj: ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్‌‌ కన్నుమూత

Kathak maestro Pandit Birju Maharaj death news: కథక్ మాస్ట్రో పండిట్ బిర్జూ మహారాజ్ (83) ఆదివారం (జనవరి 16) కన్నుమూశారు. గుండెపోటుతో (Heart attack) మరణించినట్లు ఆయన బంధువులు తెలిపారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ (Kathak maestro Pandit Birju Maharaj) 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. ఆయన కథక్ డ్యాన్సర్‌గానే కాకుండా శాస్త్రీయ గాయకుడు, కవి, డ్రమ్మర్ కూడా. ఈయన తన మెుట్టమెుదటి సోలో ప్రదర్శన బెంగాల్‌లోని మన్మథ్ నాథ్ ఘోష్ ఉత్సవాల్లో ఇచ్చారు. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

పండిట్ బిర్జూ మహారాజ్  పద్మ విభూషణ్‌తో (Padma Vibhushan) సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం ఆయనకు లభించిన ఇతర అవార్డులు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం , ఖైరాగఢ్ విశ్వవిద్యాలయాలు  బిర్జు మహారాజ్‌కు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశాయి. 

Also Read: Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి

'గదర్: ఏక్ ప్రేమ్ కథ'లోని 'ఆన్ మీలో సజనా' వంటి కొన్ని బాలీవుడ్ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. సత్యజిత్ రే చిత్రం 'చెస్ కే ఖిలాడీ'’కి కూడా సంగీతం అందించారు. విశ్వరూపం చిత్రంలో ఆయన నృత్యానికి  2012 లో జాతీయ చలనచిత్ర పురస్కారం (National Award) లభించింది.  2016 సంవత్సరంలో  బాజీరావ్ మస్తానీ రాసిన  'మోహే రంగ్ దో లాల్ ' పాటకు కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు (Film fare Award) అందుకున్నారు. ఆయన మరణ వార్త తనకు చాలా బాధగా కలిగిందని ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ (Singer Adnan Sami). 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News