Cyber Crime: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్ చేసింది.. రూ.11 లక్షలు పోగొట్టుకుంది!

cyber crime: ఓ వృద్ధురాలికు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె ఖాతా నుంచి రూ. 11 లక్షలను దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 09:33 AM IST
  • రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
  • మహారాష్ట్రలో వృద్ధురాలికి టోకరా
  • అకౌంట్ లోని రూ.11 లక్షలు దోచుకున్న కేటుగాళ్లు
Cyber Crime: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్ చేసింది.. రూ.11 లక్షలు పోగొట్టుకుంది!

Pizza cyber crime: దేశంలో రోజురోజుకూ సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. తాజాగా పిజ్జా, డ్రైఫ్రూట్లను ఆన్​లైన్​లో ఆర్డర్ చేసిన మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధురాలికి (senior citizen) కేటుగాళ్లు టోకరా వేశారు. ఆమె ఖాతాలోని రూ.11 లక్షలను హాంఫట్ చేశారు. బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో..ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే..

ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ (Mumbai woman).. గతేడాది జులైలో పిజ్జా ఆర్డర్ (Pizza order) చేశారు. డెలివరీకి ఆన్​లైన్ పేమెంట్ చేసే క్రమంలో రూ.9,999 పోగోట్టుకుంది. అక్టోబర్ 29న డ్రైఫ్రూట్స్​ను ఆర్డర్ చేస్తూ ఆన్​లైన్ లావాదేవీలో రూ.1,496ను కోల్పోయింది. సదరు మహిళ కోల్పోయిన డబ్బును రికవరీ చేయడం కోసం గూగుల్​లో లభించిన ఓ ఫోన్ నెంబర్​ను సంప్రదించింది. 

Also Read: Kerala Lottery 12 Crore: గంటల వ్యవధిలోనే రూ.12 కోట్లు సంపాదించిన పెయింటర్.. ఎలానో తెలుసా?

అది సైబర్ కేటుగాళ్లుకు వరమైంది. ఆమెతో అటు నుంచి మాట్లాడిన సైబర్ నేరగాళ్లు.. డబ్బులు రికవరీ చేయాలంటే ఫోన్​లో ఓ యాప్​ను డౌన్​లోడ్ చేయాలంటూ మభ్యపెట్టారు. తెలీక యాప్​ను డౌన్​లోడ్ చేసిన ఆ మహిళ.. వారి వలలో చిక్కుకుపోయింది. యాప్ ద్వారా ఫోన్ లోని సమాచారాన్ని వారు తస్కరించారు. మహిళ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.11.78 లక్షల డబ్బును తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. 2021 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News