Mohammed Shami: కెప్టెన్సీ అవకాశం వస్తే నేను రెడీ: మహ్మద్ షమి

Mohammed Shami: టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్సీ ఛాన్స్ వస్తే చేసేందుకు సిద్ధమన్నాడు ప్రధాన పేసర్ షమి. ఇంకా షమి ఎం చెప్పాడండే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 10:51 PM IST
  • టీమ్ ఇండియా కెప్టెన్సీపై షమి ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఏ విధంగానైన జట్టుకు ఉపయోగపడతానని వెల్లడి!
  • టెస్టు కెప్టెన్సీ రేసులో ప్రధానంగా రెండు పేర్లు
Mohammed Shami: కెప్టెన్సీ అవకాశం వస్తే నేను రెడీ: మహ్మద్ షమి

Mohammed Shami: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీపై ప్రధాన పేసర్ మహ్మద్​ షమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ చేపట్టే అద్భుతమైన అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు అన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై (Mohammed Shami captaincy) స్పందించాడు షమి.

కెప్టెన్సీపై చర్చ ఇలా..

దక్షిణాఫ్రికాతో టెస్టు (IND vs SA) సిరీస్​లో ఘోర పరాజయం తర్వాత.. విరాట్​ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి (Virat kohli) తప్పుకున్నాడు. తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్​ ఎవరనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే టెస్టు కెప్టెన్సీ రేసులోకి కొత్త పేరు వచ్చింది. అతడే మహ్మద్ షమి. తాజాగా మీడియాతో మాట్లాడిన షమి.. ఈ విషయంపై స్పందించమని అడగ్గా.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను సారథ్య బాధ్యతల గురించి ఆలోచిచడం లేదన్నాడు. కానీ.. తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వహించేందుకు సిద్ధమని మాత్రం చెప్పాడు. టీమ్​కు ఏ విధంగానైనా ఉపయోగపడాలన్నదే తన ఉద్దేశమని (Mohammed Shami on Test captaincy) స్పష్టం చేశాడు.

కెప్టెన్సీ రేసులో ఉన్నది వీళ్లే..

ప్రస్తుతం టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్సీ ఎవరనేది తేల్చేందుకు బీసీసీఐ తీవ్రంగా కసరత్తు (BCCI on New Test Captain) చేస్తోంది. అయితే ఇప్పటికే కోహ్లీ తప్పుకున్న తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లకు పూర్తి స్థాయి కెప్టెన్​గా నియమితుడైన రోహిత్​ శర్మకు.. టెస్టు బాధ్యతలు కూడా అప్పగించే అవకాశముందంటూ (Sharma test captain) వార్తలొస్తున్నాయి.

మరోవైపు కేఎల్​ రాహుల్​కు కూడా కెప్టెన్సీ ఇచ్చే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు అంచనాలున్నాయి.

రాహుల్ పేరు ఎందుకు?

గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా టూర్​కు దూరమయ్యాడు. దీనితో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​కు కేఎల్​ రాహుల్ కెప్టెన్​గా వ్యవహరించాడు. దీనితో పాటు.. కోహ్లీ దూరమవడం కారణంగా రెండో టెస్టులో కూడా కేఎల్​ రాహుల్​ కెప్టెన్సీ తీసుకున్నారుడు.

ఇప్పటికే రోహిత్ శర్మ రెండు ఫార్మాట్లలో సారథ్య బాధ్యలు నిర్వహిస్తున్న కారణంగా కెఎల్ రాహుల్​కు టెస్టు కెప్టెన్​గా ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి విశ్లేషణలు (KL Rahul Test Captain) వస్తున్నాయి.

Also read: Big Bash League: లాస్ట్‌ బాల్‌కు ముందు అలాంటి నిర్ణయమా! హాట్‌ టాపిక్‌గా మారిన డెసిషన్‌

Also read: Charanjit Singh: భారత హాకీ లెజెండ్ చరణ్​జిత్ సింగ్ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News