Australian Open - Rafael Nadal: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్లో నాదల్.. చరిత్రకు అడుగు దూరంలో స్పెయిన్‌ దిగ్గజం!!

స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకోవడానికి స్పెయిన్‌ బుల్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 04:02 PM IST
  • ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్లో నాదల్
  • చరిత్రకు అడుగు దూరంలో రఫెల్‌ నాదల్‌
  • 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌
Australian Open - Rafael Nadal: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్లో నాదల్.. చరిత్రకు అడుగు దూరంలో స్పెయిన్‌ దిగ్గజం!!

Rafael Nadal enters Australian Open 2022 Final: స్పెయిన్‌ దిగ్గజం, టెన్నిస్ స్టార్ రఫెల్‌ నాదల్‌ (Rafael Nadal) ఆస్ట్రేలియా ఓపెన్‌ (Australian Open Final) 2022 ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన ఏడో సీడ్ మాటియో బెరెటినీని (Matteo Berrettini) 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో ఓడించాడు. 2 గంటల 56 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచులో బెరెటినీ గట్టి పోటీ ఇవ్వడంతో 35 ఏళ్ల నాదల్ శ్రమించాల్సి వచింది. నాదల్ ఆరోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్​కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గెలిస్తే నాదల్ చరిత్ర సృష్టిస్తాడు. 

రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ (21st Grand Slam Singles Title)ను గెలుచుకోవడానికి స్పెయిన్‌ బుల్ రాఫెల్ నాదల్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ (Roger Federer), సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ (Novak Djokovic)​ కూడా ప్రస్తుతం 20 గ్రాండ్​స్లామ్ సింగిల్స్​​ టైటిల్స్​తో ఉన్నారు. కరోనా వ్యాక్సినేషన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022​లో ఆడేందుకు జకో​కు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో చరిత్ర సృష్టించేందుకు నాదల్​కు మార్గం సుగమమైంది.

Aslo Read: జేసీబీలో మండపానికి వెళ్లిన పెళ్లికొడుకు.. భిన్నంగా జరుపుకోవాలని మాత్రం కాదు! కారణం ఏంటంటే? (వీడియో)

ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 రెండో సెమీ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ పెట్రోస్ సిట్సిపాస్‌ (గ్రీస్‌), రెండో సీడ్‌ డానిల్ మెద్వెదెవ్‌ (రష్యా) తలపడనున్నారు. ఇందులో గెలిచిన ప్లేయర్ ఆదివారం జరిగే ఫైనల్లో రాఫెల్ నాదల్‌తో తలపడతాడు. అయితే 2009లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలవడమే నాదల్‌కు కాస్తప్రతికూలాంశం. జకోవిచ్, ఫెదరర్ లేరు కాబట్టి మనోడికి ఎదురు లేకుండా పోయే అవకాశం ఉంది. విజేతగా నిలిస్తే.. నాలుగు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లను రెండేసి సార్లు సాధించిన జకోవిచ్‌, రాయ్‌ ఎమర్సన్‌, రాడ్‌ లేవర్‌ సరసన నాదల్ చేరనున్నాడు. 

Also Read: Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News