Success Mantra: ఇలా చేస్తే మీ ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది!!

సూర్యునికి సంబంధించిన శక్తివంతమైన నివారణలను చేస్తే ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా లాభాలు ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 05:50 PM IST
  • సూర్యుడు శక్తికి మూలం
  • ప్రజలు సూర్యుడిని దేవుడిగా భావిస్తారు
  • సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషం తొలగిపోతుంది
 Success Mantra: ఇలా చేస్తే మీ ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది!!

Success tips to Sun Rising: సూర్యుడు శక్తికి మూలం. అందుకే హిందూ మతంలో సూర్యుడికి చాలా ఉన్నతమైన స్థానం ఉంది. ప్రజలు సూర్యుడిని దేవుడిగా భావిస్తారు. చాలా మంది రోజూ ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఆయన అనుగ్రహం వల్ల జీవితంలో విజయం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి అని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్యునికి సంబంధించిన నివారణలు చాలా ముఖ్యమైనవి మరియు శక్తివంతమైనవి. అవి చేయడం ద్వారా జీవితంలోని ప్రతి దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. 

సూర్యునికి సంబంధించిన శక్తివంతమైన నివారణలను చేస్తే ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా లాభాలు ఉన్నాయట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు అందులో కొన్ని వస్తువులను కలిపితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుందట. 

Also Read: NeoCov Virus: నియోకోవ్ అన్ని కరోనా వేరియంట్స్ కంటే ప్రాణాంతకమా?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండు అరచేతుల నిండా నీరు తీసుకుని సూర్యుడి ముందే (తూర్పు వైపు సూర్యుడు మనకు కనబడేలా నిల్చుని) నీరుని వదిలేస్తూ 'ఓం మిత్రాయ నమః' అని మూడుసార్లు చెపితే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయి. నీరు వదిలిన తర్వాత ఎండలో 10 నిమిషాల పాటు నమస్కారం చేసుకోవడం ద్వారా ఆరోగ్య పరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ మేలు జరుగుతుంది.

రోలి కలిపిన నీటితో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా సూర్య దోషం తొలగిపోతుంది. దాంతో ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాక శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సూర్య భగవానునికి ఎర్రటి పువ్వులతో నీటిని సమర్పించడం వలన అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. అక్షత (బియ్యం)ను నీటిలో కలిపి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి.

Also Read: Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మొసలి దాడి.. తెలిసి తెలిసి ప్రాణాల మీదకు..

పంచదార కలిపిన నీటిని సమర్పించడం ద్వారా కూడా సూర్య భగవానుడు సంతోషిస్తాడు. దాంతో జీవితంలో ఆనందాన్ని నింపుతాడు. ఇక పసుపు కలిపిన నీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ముందస్తు వివాహ అవకాశాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News