Tamannaah Bhatia: ఇట్స్ మీ టర్న్ అంటున్న తమన్నా సవాలుకు మీరు సిద్ధమేనా

Tamannaah Bhatia: సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై ఛారెంజెస్ కొత్త కాదు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా అటువంటిదే ఓ ఛాలెంజ్ విసిరింది. ఇట్స్ యువర్ టర్న్ అంటోంది. మరి మీరు సిద్ధమేనా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2022, 01:02 PM IST
Tamannaah Bhatia: ఇట్స్ మీ టర్న్ అంటున్న తమన్నా సవాలుకు మీరు సిద్ధమేనా

Tamannaah Bhatia: సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై ఛారెంజెస్ కొత్త కాదు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా అటువంటిదే ఓ ఛాలెంజ్ విసిరింది. ఇట్స్ యువర్ టర్న్ అంటోంది. మరి మీరు సిద్ధమేనా..

సోషల్ మీడియా అందుబాటులో వచ్చాక నచ్చిన అందరినీ అకట్టుకునే లేదా నలుగురికీ ఉపయోగపడే వివిధ అంశాలపై సెలెబ్రిటీలు లేదా ప్రముఖులు లేదా రాజకీయ నేతలు ఛాలెంజ్ విసురుతుంటారు. తన వరకూ తాను చేసి ఇతరులు కూడా చేయమని పిలుపునివ్వడం లేదా చేయగలరా అంటూ ప్రోత్సహించడం. ఇందుకు తగ్గట్టే అభిమానులు స్పందిస్తుంటారు. ఇప్పుడిదే కోవలో మిల్లీ బ్యూటీ , ప్రముఖ నటి తమన్నా భాటియా ఓ కొత్త సవాలు విసిరింది. ఇట్స్ యువర్ టర్న్(Its Your Turn) అంటోంది.

గని చిత్రంలోని కొడ్తే అనే స్పెషల్ సాంగ్‌లో తమన్నా(Tamannaah Bhatia)నటించింది. జనవరి 16వ తేదీన విడుదలైన ఈ ప్రత్యేక పాట అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడీ పాట ఫీవర్‌ను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా కొన్ని సూచనలు ఇస్తోంది. మరిన్ని అవకాశాల్ని తీసుకుని..ఇంకా ఎక్కువగా డ్యాన్స్ చేయండి..నేను కొడ్తే బీట్‌కు డ్యాన్స్ చేస్తున్నా..ఇక మీ వంతు అంటూ తన డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ క్రాప్ టాప్, బ్లాక్ ప్యాంట్‌తో ఉన్న తమన్నా అందర్నీ ఆకర్షిస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hyderabad Times (@hyderabad_times)

వరుణ్ తేజ్(Varun Tej) బాక్సర్‌గా నటిస్తున్న గని సినిమాకు కొర్రపాటి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్‌తో పాటు ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర, సునీల్ శెట్టిలు ఉన్నారు. మార్చ్ 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. వరుణ్ తేజ్..తమన్నాతో కలిసి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫ్రాంచైజీ ఎఫ్ 3లో కన్పించనున్నారు. 

Also read: Chiranjeevi Mother: నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి! చిరంజీవి భావోద్వేగం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News