Liquor in Supermarkets: మందుబాబులకు గుడ్ న్యూస్.. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి!

Liquor in Supermarkets: రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లలో మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోని సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకానికి అధ్యయనం చేస్తునట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. గోపాలయ్య ధ్రువీకరించారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 08:57 PM IST
Liquor in Supermarkets: మందుబాబులకు గుడ్ న్యూస్.. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి!

Liquor in Supermarkets: మందుబాబులకు గుడ్ న్యూస్! ఇకపై మద్యాన్ని సూపర్ మార్కెట్లలోనూ విక్రయించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుంది. సూపర్ మార్కెట్స్ లో మద్యాన్ని విక్రయించనున్నట్లు ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పుడదే మార్గంలో కర్ణాటక సర్కారు నడవనుందని సమాచారం. 

సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయంపై అధ్యయనం చేసేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కే. గోపాలయ్య ఓ బృందాన్ని నియమించారు. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లలో మద్యం విక్రయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవనుంది. ఇదే విషయాన్ని మంత్రి గోపాలయ్య ధ్రువీకరించారు. 

"సూపర్ మార్కెట్లలో మద్యం విక్రయం అనే విషయాన్ని ఇటీవలే ప్రవేశపెట్టారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నాం. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి లాభం వస్తుందో లేదో చూడాల్సి ఉంది. దీని వల్ల సూపర్ మార్కెట్లోని ఇతర వ్యాపారలపై ప్రభావం పడకూడదని మా అభిప్రాయం" అని కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి కె. గోపాలయ్య అన్నారు.  

మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి

రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో వైన్ విక్రయాలకు మహారాష్ట్ర సర్కారు ఇటీవలే అనుమతించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం అమోదించింది. ఇకపై ఆ రాష్ట్రంలో కిరాణా షాపుల తో పాటు సూపర్ మార్కెట్లలో వైన్ కొనుగోలు చేసేందుకు త్వరలోనే అనుమతులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్లతో పాటు కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలను అనుమతినిస్తూ.. 'షెల్ఫ్ ఇన్ షాప్' అనే పాలసీకి ఉద్ధవ్ ఠాక్రే మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

అయితే ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థల సమీపంలోని సూపర్ మార్కెట్లతో పాటు కిరాణా షాపుల్లో వైన్ విక్రయానికి అనుమతిలేదు. వీటితో పాటు మద్యం నిషేధించిన జిల్లాలో వైన్ అమ్మకాలకు అనుమతి ఉండదు. అయితే ఇలా సూపర్ మార్కెట్లతో పాటు కిరాణా షాపుల్లో మద్యం విక్రయించేందుకు లైసెన్స్ కోసం సదరు దుకాణ దారులు రూ.5000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  

Also Read: DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివిగో..!

Also Read: Republic Day Parade: రిపబ్లిక్ డే పరేడ్ లో వాళ్లకు అనుమతి లేదు.. మార్గదర్శకాలు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x