Tea and Coffee with Empty Stomache: ఉదయం వేళల్లో లేచీ లేవగానే..బెడ్ కాఫీ లేదా బెడ్ టీ. ఇది సర్వ సాధారణం. అంటే పరగడుపున అన్నమాట. ఇదే అతి పెద్ద ఆందోళన కల్గించే అంశమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పరగడుపున టీ లేదా కాఫీ తాగితే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.(Side Effects of tea and coffee with empty stomache)
రోజావారీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. కొన్ని అలవాట్లు మానేయాల్సి వస్తుంది. కొన్ని అలవాట్లను సమయం మార్చుకోవల్సి వస్తుందంతే. ఇందులో ప్రధానమైంది ఉదయం వేళల్లో లేచీ లేవగానే టీ లేదా కాఫీ సేవించడం. అంటే పూర్తిగా పరగడుపున టీ, కాఫీలు తీసుకోవడం. వాస్తవానికి ఇది సర్వ సాధారణం. పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇది కన్పిస్తుంది. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తీసుకునేవారే ఎక్కువగా కన్పిస్తారు. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గించే అంశంగా మారింది. ఎందుకంటే పరగడుపున టీ లేదా కాఫీ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
చాయ్ లేదా కాఫీ అంటే చాలామందికి ఇష్టమే. ఉదయం వేళల్లో ఓ కప్పు టీ తాగితే లేదా కాఫీ సేవిస్తే ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నా లేదా పనిభారం నుంచి రిలీఫ్ కోసం టీ లేదా కాఫీ అనేది అనాదిగా ఓ ప్రత్యామ్నాయంగా ఉంది. టీ లేదా కాఫీలు పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదనేది అతి ముఖ్యం. పరగడుపున ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు సేవించకూడదు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఉత్సాహంగా ఉంటుందనేది కేవలం అపోహేనంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి పరగడుపున టీ, కాఫీలు సేవించడం వల్లన రోజంతా అలసటగా ఉంటుందట. అదే సమయంలో మానసికంగా ఒత్తిడి, చికాకు ఉంటాయి. అంతేకాదు పరగడుపు టీ, కాఫీల కారణంగా వికారం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య వెంటాడుతుంది. నరాల సమస్య ఉంటుంది. పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే..కడుపులో ఉంటే గుడ్ బ్యాక్టీరియా దెబ్బ తింటుంది. ఫలితంగా ఇది జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు..యూరిన్ ఇన్ఫెక్షన్ కొత్త సమస్యగా మారుతుంది. ఎందుకంటే శరీరంలో నీరు లేకపోవడం, డీ హైడ్రేషన్ కారణంగా ఇది జరుగుతుంది. ఉదయం వేళల్లో పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే..ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా ఉంటాయి.
అందుకే ఉదయం వేళల్లో టీ, కాఫీలు తీసుకోవడం మానేయడం మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత ఒకసారి, సాయంత్రం వేళల్లో స్నాక్స్‌తో పాటు మరోసారి తీసుకుంటే చాలు. ఇలా ఓ క్రమబద్ధంగా టీ, కాఫీ అలవాటు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తవు. రోజుకు రెండుసార్లు, అది కూడా ఖాళీ కడుపున కాకుండా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్లు మరీ అప్రమత్తంగా ఉండాలి.
Also read : Olive Oil: మీ రెగ్యులర్ వంటనూనె స్థానంలో ఆలివ్ ఆయిల్ చేరిస్తే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook