PMKMY pension scheme: పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన.. సన్నకారు రైతులకు నెలకు రూ.3000 పెన్షన్

PMKMY pension scheme: చిన్న, సన్నకారు రైతులకోసం కేంద్రం పీఎం కిసాన్ మాన్​ ధన్ యోజనను ఆవిష్కరించింది. ఈ పథకం ఉద్దేశం ఏమిటి? ఎవరు అర్హులు?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 11:30 AM IST
  • సన్నకారు రైతులకోసం కేంద్రం ప్రత్యేక పథకం
  • నెల నెల పెన్షన్ ఇవ్వడమే ప్రధాన లక్ష్యం
  • దేశవ్యాప్తంగా 3-5 కోట్ల మందికి లబ్ధి!
PMKMY pension scheme: పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన.. సన్నకారు రైతులకు నెలకు రూ.3000 పెన్షన్

PMKMY pension scheme: చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రతను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాన్​ ధన్ యోజన (పీఎంకేఎంవై) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

చిన్న, సరన్నకారు రైతులు వృద్ధాప్యంలో ఇబ్బందులు లేకుండా జీవిచేందుకు, ఏదైనా కారణం వల్ల ఉపాధి కోల్పోవడం వంటివి జరిగితే.. ఈ పథకం వారికి అండగా నిలుస్తుంది.

2019 ఆగస్టు 9న ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. 3-5 కోట్ల మంది చిన్న సన్న కారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది.

ప్రయోజనాలు..

ఈ పథకం ద్వారా అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ప్రతి నెల రూ.3,000 చొప్పున పెన్షన్ లభించనుంది. అయితే 60 ఏళ్లుపైబడిన వారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది.

అర్హతలు..

ఈ పథకం ద్వారా పెన్షన్ పొందేందుకు 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు మాత్రమే అర్హులు.

29 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే.. నెలకు రూ.100 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇంతే మొత్తంలో జమ చేస్తుంది.

కనీసం 20 ఏళ్లు పొదుపు చేసిన వారికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తిగా అందుతాయి.

అయితే ఈ పథకంలో చేరేందుకు కచ్చితమైన కొన్ని నిబంధనలు విధించింది ప్రభుత్వం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులుగా గుర్తింపు పొందటం సహా ఆర్థిక స్థితి వంటివాటిని పరిగణలోకి తీసుకుంటుంది.

వారికి ప్రయోజనకరం..

వ్యవసాయ పనులు చేసే వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఎందుకంటే.. వ్యవసాయ పనులు చేసే వారు పొలాల్లో చాలా కష్టపడతారు. ఈ కారణంగా వృద్ధాప్యంలో వారికి అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే ఈ పథకంలో పొదుపు చేయడం ద్వారా వృద్ధాప్యంలో కొంతైనా ఆర్థిక భరోసా లభిస్తుంది. పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా అందరికీ ఈ పథకం ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి అని ఈ పథకం ప్రారంభం సమయంలో ప్రభుత్వం పేర్కొంది.

Also read: Budget 2022: నేటి నుంచి పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు- విపక్షాల అస్త్రాలు రెడీ..!

Also read: Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో వివిద ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News