Heavy Rains in Brazil: బ్రెజిల్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. సావో పాలో (Sao Paulo) రాష్ట్రంలో కుండపోత వర్షాల (Torrential rains ) కారణంగా..పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 19 మంది మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారుల ఉన్నట్లు సమాచారం. ఈ భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. దాదాపు 500 కుటుంబాలు తమ నివాసాలను విడిచిపెట్టాల్సి వచ్చింది.
రాష్ట్రంలోని 10 అత్యంత ప్రభావిత నగరాలు, 645 మునిసిపాలిటీలకు సహాయం చేయడానికి 15 మిలియన్ రియాల్స్ విడుదల చేస్తున్నట్లు సావో పాలో గవర్నర్ జోవో డోరియా (Sao Paulo Governor Joao Doria) ప్రకటించారు. బ్రెజిల్‌లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో సావో పాలో ఒకటి. దాదాపు 46 మిలియన్ల మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు (Heavy Rains) కొండచరియలు (LandSlides) విరగిపడటంతో...అనేక ఇళ్లు సమాధి కావడంతోపాటు 11 మంది మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఫ్రాంకో డ రోచా మునిసిపాలిటీలో కొండచరియలు విరిగిపడటంతో పోలీస్ స్టేషన్, వయాడక్ట్ సమాధి అయ్యాయి.
⛈️ O Governo de SP liberou R$15 milhões para auxiliar na recuperação urbana e social de 10 cidades atingidas pelas fortes chuvas deste final de semana. pic.twitter.com/T3ABK5fifx
— Governo de S. Paulo (@governosp) January 30, 2022
మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి బ్రెజిల్ (Brazil) అనేక వాతావరణ సంబంధిత విపత్తుల బారిన పడింది. ఈ విపత్తుల కారణంగా...ఉత్తర బహియా రాష్ట్రంలో 24 మంది మరణించారు. దక్షిణ మినాస్ గెరైస్ రాష్ట్రంలో మరో 19 మంది మరణించారు. బహియాలో వరదల కారణంగా రెండు ఆనకట్టలు విరిగిపోయాయి.
Also Read: Black Snow in Russia: అయ్యో.. అక్కడ మంచు నల్లగా కురుస్తోందట! ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి