Economic Survey 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభంలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిని కొనియాడారు.
కొవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు రాష్ట్రపతి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్రాలు, డాక్టర్లు, నర్సులు, శాస్త్రవేత్తలు, హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు అంతా జట్టుగా ఏర్పడి చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచానికి మన శక్తి తెలిసింది..
ఏడాదిలోపే 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఇది మన దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పందన్నారు. ఆర్థికపరమైన విషయాలపైనా, సంక్షేమ పథకాలపైనా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడారు.
రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం.. లోక్ సభ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021-22ను ప్రవేశపెట్టారు. అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది. రేపటి సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక సర్వే 2021-22లో ఏముందంటే..
పారస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం, పారిశ్రామిక రంగం 11.8 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చని సర్వేలో తేలింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ వృద్ధి రేటు 8-8.5 శాతంగా నమోదవ్వచ్చని అంచనా వేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 9.2 శాతంగా నమోదవ్వచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక సర్వేలోని పూర్తి వివరాలను.. నేడు మధ్యాహ్నం 3.45కి మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్.
ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో బడ్జెట్ 2021లో పెట్టుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలతో కూడుకున్నదే ఈ ఆర్థిక సర్వే. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిని పూర్తిగా అర్థం చేసుకునే విధంగా ఈ సర్వే ఉంటుంది. దీనిని ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు సహా.. ఆర్థికవేత్తల బృందం తయారు చేస్తుంది. ఈ బృందం పూర్తి స్వేచ్చతో ఈ నివేదికను రూపొందిస్తుంది.
Also read: Budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ సారి కాస్త ప్రత్యేకం!
Also read: Budget 2022 Expectations: బడ్జెట్ 2022లో ఆ నిర్ణయం ఉంటే.. పెరగనున్న టెక్ హోం శాలరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook