ఓమిక్రాన్‌తో భయపడుతున్నారా.. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి!!

Healthy Food for kids: బలమైన రోగనిరోధక శక్తి.. పిల్లలలో కరోనా వ్యాప్తిని, ప్రభావాన్ని తగ్గిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికిచ్చే ఆహారంలో అనేక పోషకాలను చేర్చాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 11:37 PM IST
  • మీ పిల్లల రోగనిరోధక శక్తిని ఈ ఆహారాలతో పెంచండి
  • పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి
  • పిల్లలకు టీకాలు అందుబాటులో లేవు
ఓమిక్రాన్‌తో భయపడుతున్నారా.. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి!!

5 Healthy recipes Boost your kids immunity: మొన్నటివరకు వరకు పెద్దలకే పరిమితం అయిన కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు పిల్లలకు వస్తోంది. పిల్లలకు టీకాలు అందుబాటులో లేకపోవడంతో కొత్త వేరియెంట్ ఓమిక్రాన్‌ మరింత కలవర పెడుతోంది. అందుకే పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంతో ఉంది. బలమైన రోగనిరోధక శక్తి.. పిల్లలలో కరోనా వ్యాప్తిని, ప్రభావాన్ని తగ్గిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికిచ్చే ఆహారంలో అనేక పోషకాలను చేర్చాల్సి ఉంటుంది. ఓమిక్రాన్‌తో పోరాడేందుకు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఏ ఆహారాలను తీసుకోవాలో ఓసారి చూద్దాం.

ఖర్జూరం, నువ్వుల లడ్డు:
ఖర్జూరం, నువ్వులతో చేసిన లడ్డు చిన్న పిల్లలకు చాలా మేలుస్తోంది. ఈ రెసిపీని కేవలం 15 నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఈ వంటకాన్ని మీ చిన్నారికి మధ్యాహ్న భోజన స్నాక్స్‌గా ఇవ్వండి. ఇందులో జింక్, సెలీనియం మరియు మంచి కేలరీలు ఉంటాయి. ఈ లడ్డు రక్తంలో రోగనిరోధక శక్తిని మరియు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. 

గోల్డెన్ మిల్క్:
పాలు (200 మి.లీ), బాదం పొడి (1 tsp), పసుపు (1/4 tsp), దాల్చిన చెక్క పొడి (1/4 tsp), యాలకుల పొడి (1/4 tsp), మిరియాల పొడి (1/4 tsp), బెల్లం పొడి (1 tsp) కలిసి చేసే దాన్నే గోల్డెన్ మిల్క్ అంటారు. పిల్లలకు ప్రతి రాత్రి పాలను ఇవ్వాలి. పసుపు, దాల్చినచెక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ బిడ్డ జలుబు మరియు ఫ్లూతో పోరాడటానికి సహాయపడతాయి. పాలు ఎముకల బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బెల్లం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

బజ్రా సూప్:
1 కప్పు నీరు,  ½ కప్పు పెరుగు, ఉప్పు (రుచికి సరిపడా), ½ టీస్పూన్ పసుపు, ½ కప్పు బజ్రా పిండిని 10 నిముషాలు మరగబెడితే బజ్రా సూప్ రెడీ అవుతుంది. ఆపై ఆనియన్, క్యారెట్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది రోజులో ఒకపూట చిన్నారికి ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

క్యారెట్ ఫ్రైస్:
10 క్యారెట్లు, 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు. 1 చిటికెడు నల్ల మిరియాలు, 2 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల పచ్చి ఆలివ్ నూనెతో ఈ రెసిపీని తయారు చేయాలి. క్యారెట్ విటమిన్ ఎ మరియు మంచి ఫైబర్ కలిగి ఉంటుంది. కరివేపాకు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ తాళిపీఠం:
1.5 కప్పుల గుమ్మడికాయ గుజ్జు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1.5 కప్పు మిక్స్ పిండి (బజారా, రాగి, జొన్న), రుచికి తగినట్లు ఉప్పు, 1/4 tsp లవంగం పొడిని ముద్దగా కలుపుకుని గిన్నప్ప మాదిరి చేసుకోవాలి. విటమిన్ ఎ, థయామిన్, జింక్ మరియు కార్బోహైడ్రేట్ ఈ ఆహారంలో ఉంటాయి. పైవన్నీ పిల్లలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Also Read: Yash Dhull Six: పిచ్‌పై డాన్స్ చేస్తూ సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్ (వీడియో)!!

Also Read: AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్​ పాజిటివ్​- 18 వేలపైకి యాక్టివ్​ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News