Dry Fruits: డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి సమయంలో కీలకంగా మారిన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు డ్రై ఫ్రూట్స్ అత్యవసరం. అయితే చిన్నారులకు ఎంతవరకూ అవసరం, ఎలా తిన్పించాలనేది తెలుసుకుందాం.
రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను భాగంగా చేసుకోవడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం. మెరుగైన ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పెంచుకునేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా చిన్నారులకు చాలా దోహదకరం. డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా లభించే జింక్, మెగ్నీషియం వంటి పోషక పదార్ధాలు ఇతర వ్యాధులతో పోరాడేందుకు సహాయపడతాయి. అందుకే చిన్నారులకు తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయాలి. ఎదిగే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ చాలా ముఖ్యం. అయితే అధికశాతం చిన్నారులు డ్రై ఫ్రూట్స్ తినేందుకు ఇష్టం చూపించరు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎలా అలవాటు చేయాలి.
డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) నట్స్ కలిపి చిక్కీ తయారు చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు. జీడిపప్పు, పిస్తా, బాదం, డ్రై ఆప్రికాట్, ఎండు ద్రాక్షలు కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ ఓట్స్ పౌడర్ చేసుకుని..తేనెతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇక మరో పద్ధతి జీడిపప్పు, బాదం, వాల్నట్స్, పిస్తా కలిపి పొడి చేసుకుని..పాలు, గంజి, సెరిలాక్‌తో కలిపి తిన్పించవచ్చు. మరో పద్ధతి డ్రై ఫ్రూట్స్‌ని తేలికపాటి ఫ్రై చేసి..కాస్త మసాలా కలిపి తిన్పిస్తే బాగుంటుంది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని పౌడర్ చేసి పిల్లలు తాగే పాలు లేదా బూస్ట్‌లో కలిపి ఇవ్వడం ఉత్తమమైన మార్గం. ఎందుకంటే పాలు లేదా బూస్ట్‌లో కలిపిస్తే పిల్లలు ఇష్టపడకుండా ఉండరు. ఎదిగే పిల్లల్లో ఎముకలు బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతుంది.
Also read: Insomnia or Shortage of Sleep: రోజుకు 8 గంటల నిద్ర లేదా, అయితే మీకీ సమస్యలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook