PM Kisan Yojana 2022: రైతులకు ఆర్థికంగా ప్రోత్సహకం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇప్పటికే 10 విడతలు పూర్తయింది. జనవరిలోలోనే 10 విడుత డబ్బులు జమచేసింది కేంద్రం. ఇక అప్పుడే 11వ విడతపై కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
10 విడతల్లో ఎంత ఖర్చు చేసిందంటే..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం తొమ్మిది విడతల్లో రూ.1.58 లక్షల కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. ఇక 10 విడతలో రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించింది. 9వ విడతలో ఏదైనా కారణం వల్ల డబ్బులు జమకాని రైతులకు మాత్రం 10 విడతలో రూ.4 వేల చొప్పున జమ చేసింది ప్రభుత్వం.
11వ విడత ఎప్పుడు ఉండొచ్చు?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ముఖ్య ఉద్దేశం రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సహాయం అందించడం. అయితే మొత్తం ఒకేసారి కాకుడా వాయిదా పద్దతుల్లో ఏడాదికి మూడు సార్లు రూ.2 వేల చొప్పున ఈ పథకం అమలవుతుంది. అంటే సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఓ సారి కేంద్రం ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఆర్థిక సంవత్సరం లెక్కనే ఈ సహాయం అందుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ ప్రారంభం నుంచి జైల మధ్య అమలు అయ్యే అవకాశముంది. పథకం లెక్కల చూస్తే ఇది 11వ విడత సహాయం కానుంది.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11.37 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..
- ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి (https://pmkisan.gov.in)
- హోం పేజీలో New Farmer Registration అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది మిమ్మల్ని రిజిస్ట్రేషన్ పేజీకి తీసుకెళ్తుంది.
- కొత్త పేజీలో మీరు గ్రామీణ ప్రాంత రైతులా లేదా పట్టణ ప్రాంత రైతుల అనేది తెలియజేయాలి.
- ఆ తర్వాత ఆ ఫారంలో అడిగిన విరాలన్ని సమర్పించపాలి (పేరు, ఊరు, ఫోన్‌నంబర్, ఆధార్ నంబర్ వంటివి).
- ఆ తర్వాత మీ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపిని ఎంటర్ చేయడం ద్వారా తర్వాతి స్టెప్‌కు వెళ్లాలి.
- ఇక్కడ మీకు సంబంధించిన కొన్నిడాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయమి అడుగుతుంది. వాటిని అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- మీ దరఖాస్తును సంబంధిత శాఖ రివ్యూ చేసి.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చేర్చుతుంది.
నోట్: ఈ అప్లికేషన్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలు సహా ఇతర సమచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఓ ఫారంను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
Also read: India Covid-19 Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు
Also read: Himachal Pradesh snow: మంచు కురిసే వేళలో.. హిమాచల్ అందాలు చూద్దామా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook