Coffee Benefits: దైనందిక జీవితంలో కాఫీ, టీలు ఓ భాగం. టీ, కాఫీల వల్ల ప్రయోజనాలున్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైనా సరే మోతాదు మించకూడదు. ఈ నేపధ్యంలో కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.
దేశంలో టీ ఎంతగా ప్రాచుర్యం పొందిందో..విదేశాల్లో కాఫీ అంతగా పాపులర్. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కాఫీకు ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజున జరుపుకున్నా..కాపీ పట్ల ఆసక్తి మాత్రం మాటల్లో చెప్పలేనిదే. ఈ క్రమంలో కాఫీతో కలిగే ప్రయోజనాలేంటనేది పరిశీలిద్దాం..
ఒక కప్పు కాఫీలో వందల కొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే మనిషి శరీరంలో కాస్తైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి మారుతుంది. కాఫీలో చాలా మంచి గుణాలున్నాయి. కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలోని డైఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఇందుకు ఉపయోగపడుతుంది. కాఫీ బాడీని ఉత్తేజంగా ఉంచుతుంది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే రోజుకు 2-3 కప్పుల కాఫీ మాత్రమే సేవించాలి.
హైబీపీ పేషెంట్లకు కాఫీ అంత మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్ అనే ఉత్ప్రేరక పదార్థంగా పనిచేస్తుంది. దీనివల్ల కాఫీ తాగగానే..దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ లెవెల్ పెరుగుతుంది. కాఫీలో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే యాంటీ మైగ్రేన్ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే ప్రయోజనం ఉండదు.
రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో(Coffee Health Benefits) ఒక వయసు తర్వాత గ్లకోమా కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకుండా ఉంటే ఆరోగ్యానికి, శరీరానికి మంచిది.
Also read: Black Grapes Benefits: నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.