Viral Videos: సింహం నోట్లోంచి తప్పించుకునేందుకు నీళ్లలో దూకింది.. కానీ ఇంతలోనే..

Buffalo Escape Video: చావు నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ దున్న చివరకు చావు ఎదుట వచ్చి నిలబడాల్సి వచ్చింది.. సింహం, మొసలి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న దున్న చివరకు ఏమైందో ఈ వీడియోలో చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 05:46 PM IST
  • ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డాలనుకున్న దున్న
  • దున్నను తరుముకుంటూ వచ్చిన సింహం
  • సింహం నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి దూసుకెళ్లిన దున్న
  • నీటికి మొసలికి చిక్కిన దున్న
Viral Videos: సింహం నోట్లోంచి తప్పించుకునేందుకు నీళ్లలో దూకింది.. కానీ ఇంతలోనే..

Buffalo Viral Video: మనకు చావు అనేది ముందే రాసి పెట్టి ఉంటుంది.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ ఫైనల్ డెస్టినేషన్ మూవీ సిరీస్‌లో చూపించారు. పాపం ఈ దున్న పరిస్థితి కూడా అలాంటిదే. ప్రమాదం నుంచి తప్పించుకుని ఎలాగోలా బతికి బయటపడ్డాలనుకున్న దున్నకు చివరకు చావు తన ముందు కనిపించింది. 

ఆ దున్నకు బతకాలనే సంకల్పం ఉన్నా కూడా చివరకు అది విధి ముందు తల వంచాల్సి వచ్చింది. ఒక దున్నను సింహం తరుముకుంటూ రావడం ఈ వైరల్ వీడియోలో చూడొచ్చు.

దీంతో ఆ దున్న సింహం నుంచి తప్పించుకునేందుకు అక్కడే ఉన్న నీటిలోకి దూసుకెళ్తుంది. ఇక సింహం నుంచి ప్రాణాలు రక్షించుకున్నాను.. హమ్మయ్యా... అని దున్న అనుకునేలోపే మరో ప్రమాదం దానికి ముంచుకొచ్చింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో nature27_12 అనే అకౌంట్‌ ద్వారా పోస్ట్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక దున్నను సింహం తరుముకుంటూ రావడం ఈ వీడియోలో చూడొచ్చు. తర్వాత ఆ దున్న నీటిలో ఈదుకుంటూ ముందుకు వెళ్తుండగా సడెన్‌గా ఒక మొసలి దాన్ని పట్టుకుంటుంది. అయితే మొసలి నుంచి ఆ దున్న ఎలాగోల తప్పించుకుంటుంది. తర్వాత నీటిలో నుంచి ఒడ్డుకు వచ్చే క్రమంలో దాని ముందు మూడు సింహాలు వచ్చి నిలబడతాయి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by طبیعت (@nature27_12)

 

ఒకవైపు నీటిలో మొసలి.. ఒడ్డున సింహాల గుంపు.. తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియక దున్న సతమతమవుతూ ఉంటుంది. ఇక చివరకు ఆ దున్న ప్రాణాలతో బయటపడిందో లేదో కూడా తెలియదు.

Also Read: Nokia G11 Launch: నోకియా స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వస్తుంది!

Also Read:AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News