Virat Kohli Break: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కోల్‌కతా వేదికగా వేదికగా రేపు (ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీకి బయోబబుల్ నుంచి 10 రోజులు బ్రేక్ ఇచ్చింది బీసీసీసీ. కోహ్లీ ఇంటికి వెళ్లనున్నందుకు గానూ.. ఈ బ్రేక్ ఇచ్చింది.
ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేపు జరగనున్న మ్యాచ్ కేవలం నామమాత్రపు మ్యాచ్ కానుంది..
శ్రీలంక సిరీస్‌కూ కోహ్లీ దూరం..
వెస్టిండీస్‌తో జరగనున్న చివరి టీ20తో పాటు.. ఫిబ్రవరి 24 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు సైతం విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు.
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లఖ్‌నవూలో జగనుంది. మిగతా రెండు మ్యాచ్‌లు ధర్మశాల వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 26న రెండో టీ20, 27న మూడో టీ 20 జరగనుంది.
'విరాట్ కోహ్లీ శనివారం ఇంటికి వెళ్లనున్నాడు. వెస్టిండీస్‌తో ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లకు.. పని భారం సహా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇలా విరామం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.' అని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో వెల్లడించాయి.
కోహ్లీ బ్యాక్ టూ ఫామ్?
ఇక గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ ఆటకు ప్రశంసలు దక్కాయి. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భాగస్వామ్యం సహా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌ల బౌలింగ్ కారణంగా ఎనిమిది పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 41 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. రిషబ్ పంత్ 28 బాల్స్‌లో 52 కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.
Also read: IND vs WI: మెరిసిన కోహ్లీ, భువీ.. రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం! సిరీస్ కైవసం!!
Also read: IND vs WI: ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. పంత్ సూపర్ హాఫ్ సెంచరీ! విండీస్ లక్ష్యం 187!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Virat Kohli Break: విరాట్ కోహ్లీకి బ్రేక్- వెస్డీడీస్తో మూడో టీ20కి దూరం..!
విరాట్ కోహ్లీకి మళ్లీ బ్రేక్
వెస్టిండీస్‌తో చివరి టీ20కి దూరం
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కూడా..