Queen Elizabeth II: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2కు కరోనా పాజిటివ్

Queen Elizabeth II: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2 కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆదివారం పాటిజివ్‌గా తేలినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ తెలిపింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 08:03 PM IST
  • ఎలిజబెత్‌ రాణికి కరోనా పాజిటివ్‌
  • స్వల్ప లక్షణాలు ఉన్నట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడి
Queen Elizabeth II: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2కు కరోనా పాజిటివ్

Queen Elizabeth IITests Positive For Covid-19: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2(95)కి (Queen Elizabeth II) కొవిడ్ సోకింది. కరోనా పరీక్షలు చేయగా..ఆమెకు ఆదివారం పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ (Buckingham Palace) తెలిపింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. ఎలిజబెత్‌ ప్రస్తుతం తన విండ్సర్ కాజిల్ నివాసంలో ఉన్నారు. రాణి ఇప్పటికే మూడు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పరిపాలించిన రాణిగా ఇటీవల 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహారాణి పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ ఈనెల 10న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్‌లో 99 సంవత్సరాల వయస్సులో మహారాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణించారు. 

బ్రిటన్ లో కరోనా కేసులు (Corona Cases in Britain) తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెక్ట్స్ వీక్ నుంచి కొవిడ్ బాధితులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ‘'కొవిడ్​తో సహాజీవనం'’ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోరిస్ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం చాలా ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  కేసులు మరింత పెరగడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.

Also Read: Storm Eunice: ఐరోపాను అతలాకుతలం చేస్తున్న 'యూనిస్' తుపాన్.. 9 మంది మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News