Palindrome and Ambigram date: ప్రతి రోజు ఓ కొత్త రోజే అయినప్పటికి.. కొన్ని తేదీలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఓ పండుగో, సినిమా రిలీజ్ తేదీనో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ రోజు తేదీనే చాలా ప్రత్యేకం.
ఈ రోజు తేదీ 22 ఫిబ్రవరి 2022.. అదే సంఖ్యా పరంగా చూస్తే '22022022'. ఈ తేదీని ఎడమ నుంచి కుడికి.. కుడి నుంచి ఎడమకు ఎలా చదివినా ఒకే విధంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఇది అత్యంత అరుదైన తేదీ. మళ్లీ మళ్లీ కనిపించని తేదీ.
ఎటు నుంచి చదివినా ఒకే విధంగా కనిపిస్తుంది కాబట్టి.. ఇది పాలీడ్రోమ్ తేదీ. మరో విశేషం ఏమిటంటే.. ఇది అంబిగ్రామ్ తేదీ కూడా. అంటే ఈ తేదీని తలకిందులుగా చదివినా అందులోని అంకేలు ఒకే విధంగా కనిపిస్తాయి.
ఇంకా ఈ తేదీలో మరో విశేషం ఏమిటంటే.. మొత్తం అంకెల్లో 2, 0 మాత్రమే ఉన్నాయి. ఎనిమిది డిజిట్స్ కలిగిన ఈ తేదీలో ఆరు 2 అంకెలు.. రెండు 0 అంకెలు ఉన్నాయి.
ఎక్కువగా రెండు అంకెలు ఉండటం వల్ల ఈ రోజును 'TWOS Day' అని కూడా పిలుస్తారు.
ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల 22 నిమిషాలకు మరో విశిష్ఠత సంతరించుకోనుంది. ఇదివరకే ఇవాళ ఉదయం రెండు గంటలకు ఈ విశిష్టత సంతరించుకుంది.
వారికి చాలా స్పెషల్..
ఈ రోజు పుట్టిన పిల్లలకు, పెళ్లిల్లు చేసుకునే.. వారికి ఇది ఇంకా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇంతకి విశిష్ఠత కలిగిన రోజు కాబట్టి.. ఈ రోజును చాలా మంది సెలెబ్రేట్ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోయే ఛాన్స్ లేదు.
Also read: Moles Meaning: శరీరంపై ఆ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులే!
Also read: Onion Cutting Tips: ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు రాకుండా సింపుల్ టిప్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook