Vastu Tips For Money: ఇంటి వాస్తు ఇలా ఉంటే.. లక్ష్మీ దేవి వద్దన్నా వస్తుందట!

భారతీయ సంప్రదాయాల్లో వాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వేల సంవత్సరాల నుంచి దేశంలో వాస్తు శాస్త్రం అందుబాటలో ఉంది. అందే చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తును చూస్తారు. ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారం ఉందా? లేదా అనేది చూస్తారు?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 06:55 PM IST
  • ఇంటికి ప్రధాన ద్వారం ఎటువైపు ఉండాలి
  • వంటగది ఎక్కడ ఉంటే మంచిది?
  • లక్ష్మీ దేవి కటాక్షం లభించాలంటే పాటించాల్సిన వాస్తు నిబంధనలు!
Vastu Tips For Money: ఇంటి వాస్తు ఇలా ఉంటే.. లక్ష్మీ దేవి వద్దన్నా వస్తుందట!

Vastu Tips For Money: భారతీయ సంప్రదాయాల్లో వాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వేల సంవత్సరాల నుంచి దేశంలో వాస్తు శాస్త్రం అందుబాటలో ఉంది. అందే చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తును చూస్తారు. ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారం ఉందా? లేదా అనేది చూస్తారు?

అన్ని వాస్తు ప్రకారం ఉంటే ఇంట్లో సంపద, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. వాస్తు విషయంలో చెసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని సార్లు మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యంపై పడపుతుందని చెబుతుంటారు.

ఇంటి ప్రధాన ద్వారం ఎక్కడివైపు ఉండాలి..

వాస్తు గ్రంథాల ప్రకారం ఇంటికి ప్రధాన ద్వారాం తూర్పు, ఉత్తరం, పడమటి వైపు ఉండటం ఉత్తమం. తూర్పూ, పడమర, ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉంటే.. అది విజయానికి, ఆర్థిక వృద్ధికి మంచిదని చెబుతుంటారు వాస్తు నిపుణులు. అయితే ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

ప్రస్తుతం పట్టణాల్లో ఇరుకుగా ఆపార్ట్​మెంట్స్​ కడుతూ.. వాస్తు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. బిల్డింగ్ ప్లాన్ ప్రకారం.. ప్రధాన ద్వారాన్ని పెడుతుంటారు. అందుకే అపార్ట్​మెంట్​లో ప్రధాన ద్వారం ఎక్కడివైపు వస్తుందో ముందే తెలుసుకుని కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

లక్ష్మీదేవీ ఇంట్లో ఉండాలంటే..

ఇంట్లో లక్ష్మీ దేవీ అనుగ్రహం ఉండటానికి, సంపదను ఆహ్వానించడానిక ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ చక్కగా అలంకరించుకోవాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ప్రధాన ద్వారంపైన ఉండే గొడకు ఇత్తడి సూర్యున్ని వేలాడదీయడం వల్ల మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.

వంట గది వాస్తు..

ఇంటి నిర్మాణంలో వంటగదిపై కూడా దృష్టిసారించాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో వంటగది ఆగ్నేయంలో గానీ లేదా వాయువ్యంలో గానీ ఉండొచ్చని అంటున్నారు. వంట చేసే టప్పుడు తూర్పు ముఖంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

నీటి కుండతో సంపద..

ఈశాన్యం, నైరుతి దిశల్లో వంట గది ఉండటం లేదా వంట చేయండం వంటివి ఇంట్లో వారిపై ఆరోగ్యపరంగా, సంపద పరంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. ఒకవేల ఎవరైనా అలాంటి ఇళ్లల్లో ఉంటే గానక.. వెంటనే వాస్తు నిపుణుడిని కలిసి.. దేషాలను సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంటికి ఈశాన్యంలో 20 లీటర్ల ఇత్తడి కుండను ఉంచి దానిని కనీసం ప్రతీ 15 రోజులకు ఓసారి నింపుతూ ఉండాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించొచ్చని చెబుతున్నారు.

Also read: Horoscope Today Feb 22 2022: నేటి రాశి ఫలాలు.. సడెన్ ఆఫర్‌తో ఆ రాశివారు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్

Also read: Lord Hanuman: ఆంజనేయ స్వామికి పవన పుత్ర అనే పేరు ఎలా వచ్చింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News