Lord Hanuman: ఆంజనేయ స్వామికి పవన పుత్ర అనే పేరు ఎలా వచ్చింది?

Lord Hanuman: భక్తుల కోరికలు తీర్చే భగవంతునిగా ఆంజనేయస్వామి నిత్యం కీర్తింపబడుతున్నారు. శివుని 11వ అవతారంగా పరిగణించే ఈ స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే ఆయన్ని పవన పుత్ర లేదా వాయు పుత్ర అని ఎందుకు పిలుస్తారు? అలా పిలిచేందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 06:32 AM IST
Lord Hanuman: ఆంజనేయ స్వామికి పవన పుత్ర అనే పేరు ఎలా వచ్చింది?

Lord Hanuman: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి వారంలోని మంగళవారం ఆంజనేయస్వామికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజున హనుమంతుని పూజిస్తారు. ఆ రోజున ఆయన్ను ప్రసన్నం చేసుకొని.. భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటారు. మన దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా మంగళవారం నాడు ఈ స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ రోజున చేసే ప్రతి పూజపై ఎక్కువ ప్రభావం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామిని రామభక్త హనుమాన్, బజరంగబలి, పవన్‌పుత్ర, అంజనీ పుత్ర, మారుతీ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. అయితే ఈ భగవంతుడిని పవన్ పుత్ర అని ఎందుకు పిలుస్తారు? ఆయన్ని పూజించడం వల్ల దక్కే అష్ట సిద్ధి గురించి ఇప్పుడు చర్చిద్దాం.  

శివుని అవతారం

హిందూ శాస్త్రాల ప్రకారం.. పరమ శివుని 11వ అవతారంగా ఆంజనేయస్వామిని పరిగణిస్తారు. రుద్రుడు.. మహేశ్వరుడితో పాటు ఇంద్రుడ్ని పూజించిన తర్వాత శివుడు, హనుమంతుని అవతారం పొందాడని చెబుతుంటారు. హనుంతుడు అనే సద్గుణాలు కలిగిన వాడు. అత్యంత తెలివి, వేగవంతమైన, కీర్తి ప్రతిష్టలున్న గొప్ప శక్తి. 

పవన పుత్ర అని ఎందుకు పిలుస్తారు?

శ్రీరాముడు రావణుడిని హతం చేసిన విషయంలో హనుమంతుడు పాత్ర ముఖ్యమైనదని మనకు రామాయణం బోధిస్తుంది. సుమేర్ వానర రాజు, అంజని ల కుమారుడు ఆంజనేయస్వామి. అంజనీ మాత చాలా ప్రకాశవంతమైన, భక్తిగల స్త్రీ. అలాగే ఆమె యోగాలో చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఆమె యోగా ద్వారా వాయు సిద్ధిని (వాయు దేవుని అనుగ్రహం) పొందింది. అందుకే హనుమంతుడిని వాయుపుత్ర లేదా పవన పుత్ర అని కూడా అంటారు.

(నోట్: పైన పేర్కొన్న సమచారామంతా హిందూ శాస్త్రాల నుంచి సంగ్రహించినది. దీన్ని పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.) 

Also Read: Todays Horoscope 19th Feb 2022: ఈ రాశివారి నేటి జాతకం ఇలా ఉంటుంది, ఆ రాశివారికి పదోన్నతులుంటాయి

Also Read: Hanuman Chalisa Rules: హనుమాన్ చాలీసా జపించే వారు ఈ తప్పులు చేయకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News