SGB 2021-22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10వ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ తేదీలు ప్రకటించింది ఆర్బీఐ. నేటి నుంచి (ఫిబ్రవరి 28) ఐదు రోజుల పాటు వీటని సబ్స్క్రిప్షన్ చేసుకునే వీలుందని తెలిపింది. అంటే మార్చి 4 సబ్‌స్క్రిప్షన్‌కు చివరి తేదీ.
పదవ విడత పసిడి బాండ్లకు గాను.. గ్రాము పసిడి ధర రూ.5,109గా నిర్ణయించింది ఆర్బీఐ. ఎవరైతే డిజిటల్ పద్దతిలో బాండ్లకొనుగోలుకు పేమెంట్స్ చేస్తారో వారికి రూ.50 తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది ఆర్బీఐ. అంటే డిజిటల్‌గా చెల్లింపు చేసే వారికి రూ.5,059గా గ్రాము గోల్డ్ లభించనుంది.
ఏమిటి ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు?
దేశంలో బంగారంపై పెట్టుబడి అనగానే భౌతికంగానే అధికంగానే అధికంగా ఉంటాయి. చాలా మంది డబ్బులు ఉంటే బంగారం కొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల వ్యవస్థలో నగదు నగదు రొటేషన్ తగ్గుతుంది. అలా కాకుండా వ్యవస్థలో వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా భౌతికంగా కాకుండా బాండ్ల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంటుంది. వీటికి ధరను కూడా ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి నిర్ణయిస్తాయి.
అంటే.. ఈ పథకం ద్వారా బంగారం కొనుగోలు చేయడం ద్వారా తరుగు వంటి సమస్య ఉండదు. దొంగిలించబడటం భయాలు కూడా ఉండవు. సాధారణంగా బంగారంపై సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. కానీ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టడం మరింత సురక్షితం. ఎందుకంటే.. వీటికి ప్రభుత్వం హామీ ఉంటుంది.
ఎస్‌జీబీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా.. వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఓ సారి మదుపరుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం.
వ్యక్తిగతంగా అయితే కనీసం ఒక గ్రాము మొదలుకుని.. గరిష్ఠంగా 4 కిలకోలక వరకు ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టొచచు. ఈ బాండ్లలో పెట్టుబడి ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
సాధారణ వాణిజ్య బ్యాంకులన్నింటిలో ఈ బాండ్లను కొనగోలు చేయొచ్చు. పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంకుల్లో మాత్రం వీటిని కొనుగోలు చేయడం కుదరదు.
Also read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!
Also read: Bharti Airtel Shares: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఎయిర్టెల్ షేర్లు డీలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook