భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ని వినూత్న రీతిలో అభినందించారు. ఇటీవలే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచిన జిన్ పింగ్‌కు మోదీ చైనీస్ ట్విట్టర్‌గా పేరుగాంచిన చైనా యాప్ సినా విబో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధాలు మరింత పటిష్టం చేయడానికి ఇరువురం కలిసి పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
జిన్ పింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే పలు సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన పాలసీలను మార్చారు. సాధారణంగా చైనాలో ఏ అధ్యక్షుడైనా కొన్నాళ్లు మాత్రమే ఆ పదవిలో ఉండే అవకాశం ఉంది. కానీ జిన్ పింగ్‌ను శాశ్వత అధ్యక్షుడిని చేయడం కోసం అక్కడి పార్లమెంట్ రాజ్యాంగాన్నే సవరించడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో 2,970 ఓట్లలో ఒక్క ఓటు మినహా మిగిలినవన్నీ జిన్ పింగ్‌కు అనుకూలంగా పడినవే కావడం గమనార్హం