Sarkaru vaari paata: సర్కారువారిపాట విడుదల మళ్లీ వాయిదా, త్వరలో రెండవ సాంగ్

Sarkaru vaari paata: మహేశ్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్. కళావతి పాట తరువాత మరో విడుదలకు సిద్ధంగా ఉందంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఎప్పుడంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 7, 2022, 06:54 AM IST
  • ఏప్రిల్ నుంచి మేకు వాయిదా పడిన సర్కారువారి పాట సినిమా
  • కళావతి తరువాత రెండవ సాంగ్ త్వరలో విడుదల కానుందని తమన్ వెల్లడి
  • రెండవ సాంగ్ కళావతిని మించి ఉంటుందని చెప్పిన తమన్
Sarkaru vaari paata: సర్కారువారిపాట విడుదల మళ్లీ వాయిదా, త్వరలో రెండవ సాంగ్

Sarkaru vaari paata: మహేశ్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్. కళావతి పాట తరువాత మరో విడుదలకు సిద్ధంగా ఉందంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఎప్పుడంటే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమా సర్కారువారిపాటపైనే అందరి దృష్టీ నెలకొంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో విడుదలైన కళావతి పాట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచింది. ట్యూనింగ్, లిరిక్స్ విభిన్నంగా ఉండటమే కాకుండా..సిద్ధ్ శ్రీరామ్ మరోసారి హైప్ ఇచ్చాడు. కీర్తి సురేష్‌తో కలిసి మహేశ్ బాబు నటిస్తున్న ఈ సినిమా పోస్టర్లు కూడా ఇప్పటికే డిఫరెంట్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకున్నాయి. సర్కారువారిపాటలో మహేశ్ బాబు లుక్ కూడా విభిన్నంగా ఉండనుంది. 

కళావతి సాంగ్ తరువాత ఇప్పుడు సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు తమన్. సినిమాలో రెండవ పాట త్వరలో విడుదల కానుందని చెప్పాడు. ప్రస్తుతం లోడ్ అవుతోందంటూ రివీల్ చేశాడు. రెండవ పాట కూడా అద్బుతంగా ఉంటుందని తమన్ అంటున్నాడు. సర్కారు వారి పాట సినిమాకు ఇప్పటికే చాలా అవాంతరాలు వచ్చాయి. మహేశ్ బాబుకు మోకాలి సర్జరీ, కరోనా బారిన పడటం, తరువాత కీర్తి సురేష్‌కు కరోనా సోకడంతో సినిమా షూటింగ్ కొద్దిరోజులు నిలిచిపోయింది. ఏప్రిల్ 1న విడుదల కావల్సి ఉండగా..ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. మే నెలలో సినిమా విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also read; Bigg Boss Non Stop: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఊహించని ట్విస్ట్..ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న సరయు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News